Railway Zone: రైల్వే జోన్ పాపం వైసీపీ దే

విభజన హామీల్లో భాగంగా ఐదేళ్ల కిందట.. సరిగ్గా గత ఎన్నికలకు ముందు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు.

Written By: Dharma, Updated On : December 7, 2023 12:55 pm

Railway Zone

Follow us on

Railway Zone: గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి అనేక కారణాలు నిలిచాయి. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్.. ఇలా ఒకటేమిటి అప్పటి టిడిపి ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసి వైసీపీ అధికారంలోకి రాగలిగింది. కానీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా విషయం మరిచిపోయింది. విభజన హామీలు అమలు నోచుకోలేదు. అన్నింటా వైఫల్యమే కనిపిస్తోంది. తాజాగా రైల్వే జోన్ విషయంలో సైతం కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. జగన్ సర్కార్ నిర్లక్ష్యాన్ని వెల్లడించింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

విభజన హామీల్లో భాగంగా ఐదేళ్ల కిందట.. సరిగ్గా గత ఎన్నికలకు ముందు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. మరి ఇంత జాప్యమా అంటూ టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏకంగా లోక్ సభలో ప్రశ్నించారు. అయితే అందులో తమ తప్పేమీ లేదని.. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్లే పాము ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయాన్ని నిర్మించలేదని కేంద్రం తేల్చేసింది. రైల్వే శాఖకు అవసరం ఉన్నప్పుడు ఇస్తామని చెప్పి రైల్వేకు చెందిన 53 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు రైల్వే జోన్ కోసం 150 ఎకరాల భూమి అవసరం. కానీ ఇచ్చేందుకు జగన్ సర్కార్ ముందుకు రావడం లేదు. దాని కారణంగానే ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతోందని కేంద్రం చెబుతోంది.

రైల్వే జోన్ విషయంలో ఏపీకి అంతులేని నష్టం జరిగింది. కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయకపోగా.. వాల్తేరు డివిజన్ విడగొట్టి మరింత నష్టం చేకూర్చారు. కొంత మొత్తాన్ని విజయవాడ డివిజన్లో కలిపి… మరికొంత భాగాన్ని ఒడిస్సా లోని రాయగడ కేంద్రంగా ఉన్న కొత్త డివిజన్ లో విలీనం చేయాలని నిర్ణయించారు. విశాఖ జోన్ తెరపైకి తెచ్చి వాల్తేరు డివిజన్ ను నిర్వీర్యం చేశారు. పేరుకే విశాఖ కేంద్రం జోన్ కానీ.. అందులో డివిజన్ ఉండే అవకాశం లేదు. ఇక్కడే ఒక లాజిక్.. విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రారంభం కాలేదు.. కానీ వాల్తేరును లాగేసుకుని రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి.

విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ కేంద్ర కార్యాలయానికి ఇంతవరకు స్థల కేటాయింపులు జరగలేదు. అయితే అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ భవనాలు అందుబాటులో ఉన్నాయి. జోన్ ఏర్పాటు చేయాలనుకుంటే అన్ని రకాల వస్తువులతో కూడిన భవనాలు విశాఖలో చాలావరకు ఉన్నాయి. కానీ కేంద్రం ఎందుకో తాత్సారం చేస్తోంది. ఎందుకిలా చేస్తున్నారు అని అడిగే స్థితిలో జగన్ ప్రభుత్వం లేదు. ఇదే రైల్వే సమస్యలను సాకుగా చూపి నాడు చంద్రబాబు సర్కార్ పై వైసిపి విషం చిమ్మింది. ఇప్పుడు కళ్ళు ఎదుటే అన్యాయం జరుగుతున్న ప్రశ్నించే స్థితిలో లేకపోవడం దారుణం .