Chandrababu : చంద్రబాబు.. 45 ఇయర్స్ పాలిటిక్స్. నిజానికి ఒకప్పుడు రాష్ట్రపతులను, ప్రధానులను డిసైడ్ చేసిన పెద్ద మనిషి. కానీ పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లి గెలిచిన చరిత్ర మాత్రం చంద్రబాబుకు లేదు.ఆయన మాటలే బూమరాంగ్ అయిపోయి చాలా సార్లు ఇరుకునపడ్డాడు. ఇప్పుడు కూడా ‘నాకంటే తోపు ఎవడూ లేడిక్కడ’ అంటూ బాబు సొంత డబ్బా కొట్టేసుకున్నారు
చంద్రబాబు మళ్లీ తన గొప్పలు చెప్పుకున్నారు. తనకు మించిన వారు లేరంటూ గొప్పలకు పోయాడు. ఈ గొప్పలకు పోయే తిప్పలు పడుతున్నారు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటిదాకా 9 ఎలక్షన్స్ చూసి నేత ఎవడూ ఈ తెలుగు రాష్ట్రాల్లో లేడని.. 45 ఏళ్ల తన రాజకీయ జీవితం ముందు ఎవరూ పనికిరారంటూ చంద్రబాబు గొప్పలకు పోయారు.
‘9 ఎలక్షన్స్.. 45 ఏళ్ల రాజకీయం.. తెలుగు జాతిలో నా తర్వాతే ఎవడైనా.. ఇన్నేళ్లు ఎవడయ్యాడా సమైఖ్య ఆంధ్రాలో ముఖ్యమంత్రి’ అంటూ ఏకవచనంతో బాబు తిట్టిపోశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని సంవత్సరాలుగా గౌరవించే రాజకీయ నాయకుడు ఉన్నాడా? లేడు అంటూ తన గొప్పతనాన్ని తనే బాబు బాకా ఊదుకుంటూ మీడియా ముందర చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది..
తొమ్మిది ఎలక్షన్లు అయ్యా.. 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యా.. pic.twitter.com/NGfaBcvpiC
— Inturi Ravi Kiran (@InturiKiran7) January 15, 2024