రైతుల నురచి సేకరిరచే ధాన్యానికి కనీస మద్దతు ధర, పేదలకు ఇస్తున్న సబ్సిడీ బియ్యం పంపిణీకి కేంద్రం గత ఆరేళ్లుగా భారీగా కోతలు విధిస్తూ పూర్తి మొత్తాలు చెల్లించడం లేదు. దానితో ఏపీ ప్రభుత్వం, పౌరసరఫరాల సంస్థ తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఎన్నిసార్లు కేంద్రానికి లేఖలు రాసినా పట్టిరచుకోవడం లేదని అధికారులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే పాత బకాయిలు ఇప్పటికైనా విడుదల చేయాలంటూ తాజాగా కేంద్రానికి మరో లేఖను రాశారు.కేంద్రానికి రాసిన తాజా లేఖలో తక్షణమే బకాయిలుగా ఉన్న రూ.4724 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ఆర్ధికశాఖ విజ్ఞప్తి చేసింది.
ప్రధానంగా రైతుల నుంచిసేకరిరచే ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్రంతోపాటు కేంద్రం కూడా కొన్ని నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఈ నిధులు రావడంలో జాప్యం జరిగితే రాష్ట్రమే ముందుగా రైతులకు చెల్లిరచడం, తరువాత కేంద్రం నుంచి నిధులు వచ్చాక రుణాలను తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే గత ఆరేళ్ల కాలంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగ్గా రాకపోవడంతో రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. తాజా గణారకాల మేరకు 2010-14లో రావాల్సిన నిధుల్లో రూ 269 కోట్లను కేంద్రం నిలిపి వేసింది. తరువాత దీనికి సంబంధించిన అకౌంట్లను కాగ్ కూడా ధృవీకరించడంతో గత ఏడాది మళ్లీ కేంద్రానికి పంపించారు.
అలాగే 2014-15 సంవత్సరానికి సంబందించి ఉమ్మడి రాష్ట్ర వ్యయంగా ఉన్న రూ 963 కోట్ల బిల్లులు కూడా ఇప్పటికీ కేంద్రం వద్ద పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి. ఈ మొత్తానికి కూడా కాగ్ ధృవీకరించింది. ఇక 2015-16లో రూ.159 కోట్లు, 2016-17లో రూ.206 కోట్లను కూడా కేంద్రం విత్‌హెల్డ్‌లో పెట్టింది. ఈ వ్యయం సక్రమమేనంటూ కాగ్ కూడా కేంద్రానికి లేఖ రాసింది. అయినప్పటికీ ఇరకా విడుదలకావడం లేదు.
ఇలా ఉండాగా, 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబందించి అన్న వితరణ్ పోర్టల్‌లో నమోదుచేసిన వివరాల్లో కొంత తేడా నెలకొనడం వల్ల రూ.785 కోట్ల వరకు నిధులను కేంద్రం నిలిపివేవేసింది. 2019-20లో కూడా రెండో త్రైమాసికానికి సంబంధిరచిన రూ.357 కోట్లు ఇంకా కేంద్రం వద్ద పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి.
కాగా, రాష్ట్రంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సిన నిధులను పౌర సరఫరాల సంస్థ అప్పులు చేసి చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో ఈ రుణాలను తీసుకొంటుంది. అయితే తాజాగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో కొత్త అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేకుండా పోతుంది.