https://oktelugu.com/

ఎన్టీఆర్ మామకు మంత్రి పదవీ దక్కేనా?

ఏపీలో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. సీఎం జగన్ దృష్టిలో పడేందుకు శతవిధలా ప్రయత్నిస్తున్నారు. జగన్ కరుణిస్తే తమకు మంత్రి పదవీ దక్కడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మంత్రి పదవులకు బోలెడన్నీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ మామగా నార్నె శ్రీనివాసరావు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి నార్ని శ్రీనివాసరావుకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 16, 2020 / 04:02 PM IST
    Follow us on


    ఏపీలో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. సీఎం జగన్ దృష్టిలో పడేందుకు శతవిధలా ప్రయత్నిస్తున్నారు. జగన్ కరుణిస్తే తమకు మంత్రి పదవీ దక్కడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మంత్రి పదవులకు బోలెడన్నీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

    ఎన్టీఆర్ మామగా నార్నె శ్రీనివాసరావు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి నార్ని శ్రీనివాసరావుకు ఏకైక కూతురు. చంద్రబాబుతో ఉన్న బంధువుత్వంతో ఆయన గతంలో టీడీపీ పని చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయన టీడీపీలో ఎక్కడా కన్పించలేదు. వీరిమధ్య ఏం జరిగిందో ఏమోగానీ 2019ఎన్నికల్లో వైసీపీ తరఫున నార్న శ్రీనివాసరావు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

    నాన్న వైఎస్ఆర్ పై జగన్ కు ఎంత ప్రేమ ఉంది?

    2019ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి నార్నె శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నించారు. జగన్మోహన్ ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చవిచూసింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పార్టీకోసం కష్టపడిన వారందరికీ పదవుల పంపకం చేశారు. ఆఖరికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి కూడా తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నార్నె శ్రీనివాస యాక్టివ్ గా ఎక్కడ కన్పించడం లేదనే టాక్ విన్పిస్తుంది.

    నందమూరి ఫ్యామిలీకి చెందిన లక్ష్మీ పార్వతికి సైతం పదవీ కట్టబెట్టిన జగన్ నార్నెకు ఏ పదవీ ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నార్నె శ్రీనివాసరావుపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతోనే ఆయన జగన్ ఎలాంటి పదవీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు నార్నెకు కూడా ఏదైనా పదవీ జగన్ ఇవ్వచ్చనే టాక్ విన్పిస్తుంది.

    ప్రస్తుతం మంత్రి పదవులు పంపకం ఉండటంతో నార్నెకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేవలం జగన్ పెద్దగా ప్రయోగాలు చేయకపోవచ్చని టాక్ విన్పిస్తుంది. జగన్ మరోసారి క్యాబినెట్ విస్తరిస్తే నార్నె శ్రీనివాసరావుకు మంత్రి పదవీ లేదా క్యాబినెట్ హోదా కలిగిన పదవీ తప్పక దక్కుతుందని వైసీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. అయితే ఎన్టీఆర్ మామ జాక్ పాట్ కొడుతారా? లేదో వేచి చూడాల్సిందే..!