https://oktelugu.com/

రూ.5 లక్షల కోట్లు అప్పులు తెస్తారా?

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసిన వారు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇధే అంశాన్ని మీడియాకు వివరిస్తున్నారు. గడచిన మూడు నెలల అప్పులు లెక్కగట్టి అది అదేళ్లకు వర్తింప జేయడం జరికాదనేది నిపుణుల వాదన. ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నాటికే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఉండటం, కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ తో వ్యవస్థలన్ని స్ధంబించాయి. దీంతో రాష్ట్ర […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2020 / 10:47 AM IST
    Follow us on

    రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసిన వారు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీడీపీ నాయకులు ఇధే అంశాన్ని మీడియాకు వివరిస్తున్నారు. గడచిన మూడు నెలల అప్పులు లెక్కగట్టి అది అదేళ్లకు వర్తింప జేయడం జరికాదనేది నిపుణుల వాదన. ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నాటికే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఉండటం, కేంద్రం అమలు చేసిన లాక్ డౌన్ తో వ్యవస్థలన్ని స్ధంబించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని కోల్పోయింది, అదే సమయంలో పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రభుత్వం అప్పుల బాట పట్టింది.

    Also Read : టీడిపి కి ఆ ప్రాంతం నేతలంతా గుడ్ బై..? అదే జరిగితే బాబు వెన్ను విరిగినట్టే..!

    ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో లాక్ డౌన్ కొనసాగడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రూ.39,529 కోట్లు ఆదాయం లభించాల్సి ఉండగా… కేవలం రూ.7,555 కోట్లు మాత్రమే వివిధ మార్గాల్లో ఆదాయం లభించింది. ఏప్రిల్ నెలలో రూ.1,123 కోట్లు, మే నెలలో రూ.2,498 కోట్లు, జూన్ నెలలో రూ.3,934 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా ఆర్ధిక శాఖ ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వం రూ.31,974 కోట్ల ఆదాయం కోల్పోయింది. లక్ష్యంలో కేవలం 19 శాతం మాత్రమే ఆదాయం లభించింది. దీంతో ప్రభుత్వం అప్పలు చేయకతప్పడం లేదు. ఏప్రిల్ లో రూ.5,000 కోట్లు, మే లో రూ.6,000 కోట్లను ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలు తెచ్చింది. ఈ మొత్తాన్ని 13 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంది. తోలి త్రైమాసికంలో ప్రభుత్వానికి రోజుకు రూ. 400 నుంచి 500 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 70 నుంచి 80 కోట్లు మాత్రమే లభించింది.

    Also Read : చంద్రబాబుని కరుణించిన కరోనా..607 కోట్ల లాభం?

    ఖజానాకు రాబడిని పెంచుకునేందుకు ఇటీవల చమురు ఉత్పత్తులపై వ్యాట్ ట్యాక్స్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. కొద్ది రోజుల వ్యవధిలోనే భూముల మార్కెట్ విలువల పెంచింది. వృత్తి పన్నును పెంచినట్లు వార్తలు వచ్చాయి. గ్రామాల్లో చెత్త సేకరణపై పన్ను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ఆశించినంత ఆదాయం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడుతుంది. మరోవైపు రుణ పరిమితిని పెంచే విషయంలోను కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తెస్తోంది.

    ఈ ఆర్ధిక సంవత్సరం కరోనా ప్రభావం అధికంగా ఉంది కాబట్టి అప్పులు అధికమయ్యాయి. కరోనా వైరస్ ప్రభావం తగ్గి అన్ని రంగాల్లో తిరిగి సాధారణ స్థితి నెలకొంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెగుతుంది. ఫలితంగా అప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తెచ్చిన అప్పులు సంక్షేమ పథకాలకే వెచ్చించడం మరో సమస్యగా మారింది. ఉత్పాదక రంగాలకు కేటాయిస్తే ఫలితం అధికంగా ఉంటుంది. సంక్షేమ పథకాలకు మళ్ళించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి భారంగా మారనున్నాయి. 

    Also Read : జగన్ కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు షాక్ ఇవ్వబోతున్నారా…?