Nara Lokesh America Visit: ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh) అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికా వెళ్లడం ఇది రెండోసారి. ఒక్క అమెరికా కాదు చాలా దేశాల్లో ఆయన పర్యటనలు చేశారు. అయితే ఆయన విదేశీ పర్యటనలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ పర్యటనల ఫలితాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ ఒక్క విషయం గమనించుకోవాలి. సీఎంగా చంద్రబాబు పాలనను చూసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలపై పూర్తి ఫోకస్ పెట్టారు. కానీ లోకేష్ మాత్రం తన విద్యాశాఖతో పాటు ముఖ్యంగా పెట్టుబడులు అన్వేషణకు దిగుతున్నారు. పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నారు.
* వరుసగా విదేశీ పర్యటనలు..
నాయకుడితో పాటు ప్రభుత్వ పాలనను గుర్తించుకోవాలంటే చిన్న అంశాలు చాలు. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో అదే గ్రహించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆయన అమెరికాలో పర్యటించిన సమయంలో ఒప్పందాలు ఏంటి? పెట్టుబడులు ఏంటి? అనే వాటిపై వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ చాలా రకాలుగా ప్రశ్నలు వేసింది. అయితే అప్పుడే గూగుల్ ప్రతినిధులను కలిశారు లోకేష్. ఇప్పుడు అదే గూగుల్ విశాఖలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అనుబంధంగా చాలా పరిశ్రమలు విశాఖకు వస్తున్నాయి. అలా వస్తున్న పరిశ్రమల ప్రతినిధులను గత అమెరికా పర్యటనలో కలిశారు లోకేష్. ఇప్పుడు కూడా పెట్టుబడులను టార్గెట్ చేసుకుని లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లడం విశేషం. అయితే ఈసారి ఎటువంటి పరిశ్రమలు వస్తాయో అన్న చర్చ నడుస్తోంది.
* తన శాఖతో పాటు పెట్టుబడులపై..
గత ఏడాది జూన్లో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చింది. మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన పాఠశాల విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖను కూడా పొందారు. అదే సమయంలో పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ అన్నారు. కానీ అన్ని బాధ్యతలను లోకేష్ చూస్తున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ఎక్కువగా లోకేష్ బాధ్యత తీసుకుంటున్నారు. ఐటీ దగ్గర సంస్థల ప్రతినిధులను కలవడమే కాదు. వారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల భరోసా ఇస్తున్నారు. ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నేరుగా వచ్చి పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిస్తున్నారు. దానికి మించి ఆకర్షించగలుగుతున్నారు. విశాఖ వచ్చిన పరిశ్రమలు దాదాపు లోకేష్ చొరవతో వచ్చినవే. అయితే ఇలా పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఒక విధానం అనుసరిస్తున్నారు. కేవలం చంద్రబాబుతో పాటు లోకేష్ మాత్రమే ఈ బాధ్యతలు చూస్తున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించి పవన్ కలుగు చేసుకోవడం లేదు. ఎంతవరకు ఆయన గ్రామీణ అభివృద్ధి, పంచాయితీ రాజ్ వంటి శాఖల బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు లోకేష్ అమెరికా పర్యటనతో ఎటువంటి పెట్టుబడులు వస్తాయి అని చర్చ ప్రారంభం అయింది. కచ్చితంగా ఒక భారీ పెట్టుబడి తోనే లోకేష్ అమెరికా నుంచి తిరిగి వస్తారని అంచనాలు ఉన్నాయి.