Ram Charan college days: ఇండస్ట్రీ లో ఏ సపోర్టు లేకుండా వచ్చి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్న నటుడు చిరంజీవి…కెరియర్ మొదట్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ తనని విమర్శించిన వాళ్ళతోనే మెగాస్టార్ అని పిలించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం…ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది. సామాన్యులు సైతం ప్రయత్నిస్తే హీరోలుగా ఎదగొచ్చు అనే ఒక ట్రెండ్ సెట్ చేసిన నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు జనాల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకున్నాయి. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన సినిమాలను చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు అంటే అతనికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…
ఆయన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాడు. ఇక తన కొడుకైన రామ్ చరణ్ సైతం హీరోగా రాణిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రిబుల్ ఆర్ సినిమాతో ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించిన ఆయన యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న ‘పెద్ది’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…
రామ్ చరణ్ సైతం ఆపదలో ఉన్నామని వచ్చిన వారిని ఆదుకుంటాడని చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు అతని గురించి చెప్పడం మనం చూశాం. రామ్ చరణ్ హీరో అయిన తర్వాతే సహాయం చేయడం లేదు. తను చదువుకుంటున్న రోజుల్లో తన పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బులను ఖర్చు చేయకుండా పొడుపు చేసుకొని చాలామంది పేద విద్యార్థులకు సహాయం చేసి వాళ్ళను చదివింపిచాడట. ఇక ఈ విషయాన్ని మెగా అభిమానులు సైతం చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు.
అప్పట్లో ఆయన చదివిపించిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారని చెబుతుండడం విశేషం…ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ద్వారా కూడా అతను పేదవారికి తక్కువ ధరలకు ట్రీట్మెంట్ ని అందిస్తున్నాడు. మొత్తానికైతే రామ్ చరణ్ అటు రీల్ హీరో గానే కాకుండా రియల్ హీరోగా కూడా గొప్ప పేరు సంపాదించుకోవడం విశేషం…