https://oktelugu.com/

ఉద్యోగుల సంఘం పిటీషన్ వెనుక కారణమదేనా?

రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకులు తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కోత విధించిన జీతాలు వడ్డీతో కలిపి చెల్లించాలని హై కోర్టు ఆదేశించింది. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తమ స్వార్ధం కోసం ఉద్యోగుల హక్కులను ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. Also Read : టీడిపి కి ఆ ప్రాంతం నేతలంతా గుడ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 31, 2020 / 11:53 AM IST

    What is the reason behind the Employees Union Petition?

    Follow us on

    రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నాయకులు తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కోత విధించిన జీతాలు వడ్డీతో కలిపి చెల్లించాలని హై కోర్టు ఆదేశించింది. కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు తమ నిర్ణయాన్ని ప్రకటించడంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తమ స్వార్ధం కోసం ఉద్యోగుల హక్కులను ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్నారని విమర్శిస్తున్నారు.

    Also Read : టీడిపి కి ఆ ప్రాంతం నేతలంతా గుడ్ బై..? అదే జరిగితే బాబు వెన్ను విరిగినట్టే..!

    ప్రభుత్వం తీసుకున్న జీతాల కోత నిర్ణయంపై విశాఖకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మీ కామేశ్వరి కొద్ది రోజుల కిందట హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆమె పిటీషన్ లో పేర్కోన్నారు. ఈ కేసుపై విచారణ నిర్వహించిన హై కోర్టు ప్రభుత్వం, పిటీషనర్ తరుపున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం కోత విధించిన జీతాలతోపాటు 12 శాతం వడ్డీని కలిపి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే.

    సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు రామిరెడ్డి ఈ అంశంపై కోర్టులో పిటీషన్ వేయనున్నట్లు ప్రకటించారు. జీతాల కోత ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని, జీతాలు ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పుడు విడతల వారీగా చెల్లించవచ్చని, వడ్డీ మాత్రం అసలు చెల్లించవద్దని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాత్రం ప్రభుత్వం కోత విధించిన జీతాలు వీలైనంత త్వరగా చెల్లించాలని కోరుతున్నారు.

    సచివాలయ ఉద్యోగుల సంఘం పిటీషన్ వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత నెలలో ఈ కేసులో తీర్పు ఇచ్చిన హై కోర్టు రెండు నెలల్లోగా కోత విధించిన జీతాల మొత్తాన్ని 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఇప్పుడు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి కోత విధించిన జీతాలు, వడ్డీ చెల్లించడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఈ వ్యవహారంపై తాత్సారం చేయడానికే సచివాలయ ఉద్యోగుల సంఘంతో పిటీషన్ వేయిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    Also Read : రూ.5 లక్షల కోట్లు అప్పులు తెస్తారా?