https://oktelugu.com/

మోడీకి నెటిజన్ల సెగ.. బాగానే తగిలింది

ఎంత దేశానికి రాజైనా అప్పుడప్పుడూ సమయం సందర్భం చూడకుండా చేసే పనులపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీకి కూడా నెటిజన్ల నుంచి గట్టి షాకే లభించింది. ఓవైపు కరోనా.. మరో వైపు వర్షాకాలం రావడంతో జనాలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక కరోనాతో ఉద్యోగ, ఉపాధి కోల్పోయి జనాలంతా అరిగోస పడుతున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో మోడీ నుంచి కావాల్సింది స్వాంతన.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కరోనా నియంత్రణపై భరోసా.. కానీ ఇవేవి పట్టించుకోకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 31, 2020 / 10:33 AM IST
    Follow us on


    ఎంత దేశానికి రాజైనా అప్పుడప్పుడూ సమయం సందర్భం చూడకుండా చేసే పనులపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. తాజాగా దేశ ప్రధాని నరేంద్రమోడీకి కూడా నెటిజన్ల నుంచి గట్టి షాకే లభించింది. ఓవైపు కరోనా.. మరో వైపు వర్షాకాలం రావడంతో జనాలను వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక కరోనాతో ఉద్యోగ, ఉపాధి కోల్పోయి జనాలంతా అరిగోస పడుతున్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో మోడీ నుంచి కావాల్సింది స్వాంతన.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కరోనా నియంత్రణపై భరోసా.. కానీ ఇవేవి పట్టించుకోకుండా బొమ్మల తయారీపై మాట్లాడడం.. వాటి గురించే ఆదివారం ‘మన్ కీ బాత్’ నడపడంపై ప్రజల్లో వ్యతిరేక భావం వచ్చింది.

    Also Read :  గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

    తాజాగా ఈ ఆదివారం కూడా ‘ఆల్ ఇండియా రేడియో’లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని దూరదర్శన్ తోపాటు కొన్ని ప్రైవేట్ చానెళ్లు కూడా ప్రసారం చేశాయి. ఇక మోడీ, పీఐబీ, బీజేపీ యూట్యూబ్ చానెళ్లలో మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోలను అప్ లోడ్ చేశారు.ఆశ్చర్యకరంగా మోడీ ‘మన్ కీ బాత్’ వీడియోకు యూట్యూబ్ లో నెగెటివ్ స్పందన రావడం గమనార్హం. మోడీ వీడియోకు నెటిజన్లు డిస్ లైక్ లు భారీగా కొట్టారు. ఇప్పటివరకు మోడీకి లైక్ ల మీద లైక్ వస్తుంటే తాజాగా డిస్ లైక్ లు విపరీతంగా రావడం అందరినీ షాక్ కు గురిచేసింది.

    మోడీ వీడియోకు బీజేపీ యూట్యూబ్ చానెల్ లో ఏకంగా సోమవారం ఉదయానికి డిస్ లైక్ 2.3 లక్షలు దాటాయి. లైక్ లు కేవలం 26వేలు మాత్రమే ఉండడం గమనార్హం. మోడీ యూట్యూబ్ లో డిస్ లైక్ లు 48వేలు, లైక్ లు 23వేలు వచ్చాయి. పీఐబీ చానెల్ లో డిస్ లైక్ లు 8వేలు వచ్చాయి. లైక్ లు 3.4 వేలు వచ్చాయి. మోడీకి ఇంత భారీ స్థాయిలో డిస్ లైక్ లు రావడం ఇదే తొలిసారట..

    ఇలా ఎంత మోడీ జపం చేసే జనాలకైనా సమయం సందర్భం లేకుండా ప్రజలు ఇంతటి కష్టాల్లో ఉన్న వేళ వాటి పరిష్కారాలపై మాట్లాడకుండా టాపిక్ మార్చేసిన మోడీపై ‘డిస్ లైక్ ’లతో జనం ప్రతీకారం తీర్చుకున్నారు. ప్రతిసారి తన ప్రసంగాలు, వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చి లైక్ లు తెచ్చుకొని ట్రెండింగ్ లో ఉండే మోడీ సార్ ఈసారి మాత్రం డిస్ లైక్ లతో సరిపెట్టుకోవాల్సి రావడం స్వయంకృతాపరాధమే మరీ..

    Also Read : ఏం చేయకపోయినా.. ఇది చేస్తే చాలు మోడీజీ?