కరోనాకు మహమ్మరి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి దేశ ప్రధానుల వరకు కరోనా బారినపడి మృత్యువాతపడుతున్నారు. కరోనా బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు చాలామందే ఉన్నారు. ఈ లిస్టులో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పదిరోజులుగా క్రితమే చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈయనతోపాటు పలు స్పెయిన్, యూకే దేశాల రాజకుటుంబీకులు, వివిధ అధిపతులు కూడా కరోనా బారినపడిన సంగతి తెల్సిందే.
తాజాగా బోరిస్ జాన్సస్ గర్ల్ ఫ్రెండ్ తనకు కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రకటించింది. కేరీ సైమండ్స్ అనే మహిళతో బోరిస్ జాన్సన్ సహజీవనం చేస్తున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని వీరిద్దరూ ప్రకటించారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా పదిరోజుల కిందట తను జాన్సన్ తో బెడ్ ను పంచుకున్నట్టుగా కేరీ సైమండ్స్ తెలిపింది. తనలోనూ కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రకటించడంతో వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడంతో ఆమె ఆందోళన చెందుతున్నారు.