https://oktelugu.com/

రైతు ఉద్యమం vs మోడీ ఏడేళ్ల పాలన

సాగు చట్టాలపై దుమారమే రేగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేసిన రైతు సంఘాల నేతలు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మోదీ సర్కారుపై పోరాటంలో కరోనా విలయాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని మరో మైలురాయిని చేరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న నిరసనలు బుధవారం నాటికి ఆరు నెలలు పూర్తయ్యాయి. మరోవైపు ప్రధానమంత్రిగా మోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న రోజు కూడా […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 26, 2021 4:45 pm
    Follow us on

    Farmers
    సాగు చట్టాలపై దుమారమే రేగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేసిన రైతు సంఘాల నేతలు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మోదీ సర్కారుపై పోరాటంలో కరోనా విలయాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఉద్యమాన్ని మరో మైలురాయిని చేరారు. వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న నిరసనలు బుధవారం నాటికి ఆరు నెలలు పూర్తయ్యాయి. మరోవైపు ప్రధానమంత్రిగా మోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్న రోజు కూడా ఇవాళే. ఈ నేపథ్యంలో రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ బ్లాక్ డేగా పాటిస్తుంది.

    వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ శివారులో ఆందోళన చేపట్టి ఆరు నెలలు పూర్తయిన సందర్బంగా బుధవారం రైతులు బ్లాక్ డే గా పాటిస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో రైతులు ఇళ్ల ముందు నల్ల జెండాలు ఎగురవేసి నిరసనలు చేపడుతున్నారు. దక్షిణాది రాష్ర్టాల్లో చాలా చో ట్ల నల్ల జెండాలు ఎగురవేస్తున్నారు.

    బుధవారం బుద్ధపూర్ణిమ పర్వదినం సందర్బంగా ఆందోళనలు సాగుతున్నాయి. సమాజంలో సత్యం, అహింస కరువవుతున్న నేపథ్యంలో ప్రధాన విలువల పునరుద్దరణ జరిగేలా పండుగ జరుపుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. కాంగ్రెస్ నేత నవజ్యోతి సింగ్ సిద్ధూ పటియాలాలోని తన ఇంటిపై నల్ల జెండా ఎగురవేశారు. కాంగ్రెస్, అకాలీదళ్ నేతలు సైతం ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

    రైతు ఉద్యమానికి ఆరు నెలలు, మోదీ పాలనకు ఏడేళ్ల సందర్బంగా రైతులు ఇవాళ బ్లాక్ డే జరుపుతున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. నిరసనకారులు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, గుంపులుగా చేరకూడదని రైతులకు ఢిల్లీ పోలీసులు సూచించారు. బ్లాక్ డే సందర్బంగా రైతులు కవాతుగా ఢిల్లీకి చేరబోతున్నారనే ప్రచారాన్ని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ తోసిపుచ్చారు. చలో ఢిలీ్ల పిలుపు ఇవ్వలేదని రైతులు ఎక్కడున్న వారు అక్కడే నల్లజెండాలతో నిరసనలు తెలపాలని కోరారు.