https://oktelugu.com/

సేవ్ లక్షద్వీప్ ఉద్యమం ఎందుకు మొదలైంది?

లక్షద్వీప్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భారత భూభాగానికి దూరంగా, అరేబియా సముద్రంలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో రాజకీయ కార్యకలాపాలు తక్కువ. ప్రముఖ పర్యాటక ప్రాంతంగానే దీనికి ప్రశస్తి. ఇప్పుడు సేవ్ లక్షద్వీప్ అంటే ఏకంగా ఉద్యమమే సాగుతోంది. ఇందుకు ఇతర ప్రాంతాల్లోను మద్దతు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలు, జీవనోపాధి, సంస్కృతికి నష్టం కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు. లక్షద్వీప్ కు కొత్త రపం పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ర్టేటర్ ప్రపుల్ కే […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 26, 2021 4:38 pm
    Follow us on

    Lakshadweep
    లక్షద్వీప్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భారత భూభాగానికి దూరంగా, అరేబియా సముద్రంలో ఉండే కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో రాజకీయ కార్యకలాపాలు తక్కువ. ప్రముఖ పర్యాటక ప్రాంతంగానే దీనికి ప్రశస్తి. ఇప్పుడు సేవ్ లక్షద్వీప్ అంటే ఏకంగా ఉద్యమమే సాగుతోంది. ఇందుకు ఇతర ప్రాంతాల్లోను మద్దతు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమ జీవితాలు, జీవనోపాధి, సంస్కృతికి నష్టం కలిగిస్తోందని ఆరోపిస్తున్నారు. లక్షద్వీప్ కు కొత్త రపం పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ర్టేటర్ ప్రపుల్ కే పటేల్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే దీనికి కారణం.

    కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ర్టేటర్లుగా విశ్రాంత ఉన్నతాధికారులను నియమించడం సంప్రదాయంగా వస్తోంది. గత ఏడాది నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన దినేశ్వర్ శర్మ అడ్మినిస్ర్టేటర్ గా ఉండేవారు. ఆయన డిసెంబర్ లో మరణించడంతో మరో కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేళి, డామన్ దీప్ లకు అడ్మినిస్ర్టేటర్ గా ఉన్న ప్రపుల్ పటేల్ ను ఇన్ చార్జిగా నియమించారు. ఆయన గుజరాత్ లో మంత్రిగా పనిచేశారు. ప్రధానికి సన్నిహితుడు కూడా. ఎవరిని సంప్రదించకుండా ఆయన ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే ప్రజల్లో అసంతృప్తి కలిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్య, పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉండగా వాటిని అడ్మినిస్ర్టేటర్ పరిపాలన కిందకు తీసుకువచ్చారు. నేరాల సంఖ్య తక్కువ. అయినా గూండా చట్టాన్ని ప్రయోగించారు. మద్య నిషేధం అమల్లో ఉన్నా పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు. 2019లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు అతికించారన్న కారణంతో కేసులు పెట్టించారు. అందరూ మాంసాహారులైనా జంతువధను, బీఫ్ ను నిషేధించారు.

    కేరళలోని బైపూర్ నౌకాశ్రయం నుంచి అక్కడికి సరుకులు రవాణా అవుతుంటాయి. కర్ణాటకలోని మంగుళూరు రేవు నుంచి తెచ్చుకోవాలని ఆదేశించారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని ఆరో పిస్తూ ఆ ప్రాంతం యువత సామాజిక మాధ్యమాల ద్వారా సేవ్ లక్షద్వీప్ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది.