ఆసుపత్రి నుంచి డిశ్చార్జి: ఢిల్లీకి రఘురామ పయనం

ం ఎంపీ రఘురామకు చికిత్స చేయడానికి నాలుగురోజులు పడుతుందని ఆయన తరుపున లాయర్లు చెప్పారు. అయితే మరో రెండు రోజులు ఉండగానే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఢిల్లీ పయనమయ్యారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే మళ్లీ అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతుండగా వారికి దొరకకుండా చాకచక్యంగా ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల […]

Written By: NARESH, Updated On : May 26, 2021 3:01 pm
Follow us on

ఎంపీ రఘురామకు చికిత్స చేయడానికి నాలుగురోజులు పడుతుందని ఆయన తరుపున లాయర్లు చెప్పారు. అయితే మరో రెండు రోజులు ఉండగానే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ఢిల్లీ పయనమయ్యారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లిన విషయం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే మళ్లీ అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు రెడీ అవుతుండగా వారికి దొరకకుండా చాకచక్యంగా ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

గత కొన్ని రోజుల కిందట రఘురామరాజును పోలీసులు కొట్టారని న్యాయవాదికి ఫిర్యాదు చేయడంతో ఆయనను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయాలని ఏపీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఐడీ పోలీసులు ఆదేశాలు పట్టించుకోకపోవడంతో ఎంపీ తరుపున న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీంతో రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రఘురామకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అయితే ఇటీవల కోర్టు ఎంపీ రఘురామకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనను ఏదో రకంగా మళ్లీ అదుపులోకి తీసుకోవాలని ఏపీ పోలీసులు భావించారు. దీంతో ఆయన చికిత్స పూర్తయ్యేసరికి నాలుగురోజుల సమయం పడుతుందని వైద్యుల చేత రఘురామ లాయర్లు చెప్పించారు. దీంతో చికిత్స పూర్తయిన తరువాతైనా ఆయనను అరెస్టు చేయాలని గుంటూరు అర్బన్ పోలీసులు రెడీ అయ్యారు.

గూంటూరు అర్బన్ ఎస్పీకి రఘురామ తరుపున న్యాయవాదులు కోర్టు ధిక్కార నోటీసులు పంపించడంతో అరెస్టుపై వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రఘురామ ప్ర్యతేక చార్టర్ ను మాట్లాడుకొని ఢిల్లీ పయనమయ్యాడు. సుప్రీం కోర్టులో బెయిల్ ఇచ్చిన తరువాత డిశ్చార్జ్ సమ్మరీని సీఐడీ కోర్టులో సమర్పిస్తే బెయిల్ ఉత్తర్వులు వస్తాయి. అయితే డిశ్చార్జీ సమ్మరినీ కోర్టులో సమ్మిట్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం లేనట్లే తెలుస్తోంది.