https://oktelugu.com/

BJP- 2024 Elections: 2024కు బీజేపీ రెడీ.. స్కెచ్, టీం సిద్ధం

BJP- 2024 Elections: లోక్‌సభ ఎన్నికలకు దేశంలో కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈమేరకు ఎన్నికలకు 18 నెలల సమయం ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. ఇక బీజేపీని గద్దెదించాలని ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ తమవంతుగా ప్రయత్నాలు […]

Written By: Sekhar Katiki, Updated On : September 8, 2022 4:00 pm
Follow us on

BJP- 2024 Elections: లోక్‌సభ ఎన్నికలకు దేశంలో కాంగ్రెస్‌తోపాటు, బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ 2024లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈమేరకు ఎన్నికలకు 18 నెలల సమయం ఉండడంతో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. ఇక బీజేపీని గద్దెదించాలని ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ తమవంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేసీఆర్‌ రైతు ఉద్యమాల ద్వారా బీజేపీపై పోరుకు సిద్ధమవుతున్నారు. జై కిసాన్‌ పేరిట దేశవ్యాప్తంగా సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. నితీశ్‌కుమార్‌ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మేకిన్‌ ఇండియా నంబర్‌ వన్‌ పేరుతో యాత్ర చేపట్టారు. ఇలా విపక్షాలు బీజేపీని గద్దెదించే ప్రయత్నంలో ఉండగా బీజేపీ కూడా ప్రతివ్యూహం 2024 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.

BJP- 2024 Elections

modi, amit shah

స్కెచ్‌ రెడీ…
2024 ఎన్నికల్లో బీజేపీని తిరిగి ఎలా గెలిపించాలన్న వ్యూహంతో అమిత్‌షా రంగంలోకి దిగారు. ఈమేరకు స్కెచ్‌ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటరీ బోర్డు ద్వారా మిషన్‌ 2024కు 114 సీట్లను ఇప్పటికే ఎంపిక చేశారు. ఇవి గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో ఉన్న లోక్‌సభ స్థానాలు. వచ్చే ఎన్నికల్లో వీటిని ఎలా గెలవాలో ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకోసం ఆయా లోక్‌సభ స్థానాల్లో కులాలు, మతాల వారీగా ఓటర్లను అంచనా వేస్తున్నారు. అక్కడ గెలవాలంటే ఏం చేయాలన్న సమాలోచన చేస్తున్నారు. ఏ అభ్యర్థులు అక్కడ బలం ఉంది, ఇతర పార్టీల నుంచి పార్టీలోకి వచ్చేవారు ఎవరు, ఎవరిని బరిలో నిలపాలనే లెక్కలు వేస్తున్నారు.

Also Read: Nithin- Nikhil- Nadda: నడ్డా కలవాలనుకున్నది నితిన్‌ని కాదు నిఖిల్‌నా… బీజేపీపై భారీగా మీమ్స్..!

టీం కూడా సిద్ధం..
ఇక బీజేపీ 2024 ఎన్నికల్లో విజయానికి ప్రత్యేక బృందాన్ని కూడా సిద్ధం చేస్తోంది. మొదటి నుంచి బీజేపీ నాయకత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. మొదట వాచ్‌పేయి, అధ్వానీ, తర్వాత మురళీ మనోహర్‌ జోషీ, ప్రస్తుతం మోదీ అమిత్‌షా పార్టీ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. నరేంద్రమోదీ ప్రధాని కాకముందు ఉన్న నేతల్లో రాజనాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ పార్లమెంటరీ బోర్డులో ఉన్నారు. ఇప్పడు కూడా రాజనాథ్‌సింగ్‌ పార్లమెంటరీ బోర్డులో ఉండగా, నితిన్‌గడ్కరీ కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. ఇక తమకు భవిష్యత్‌లో కీలకమని భావించిన తెలంగాణ నుంచి లక్ష్మణ్, కర్ణాటక నుంచి యడ్యూరప్ప, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సత్యనారాయణ జతియా, మహిళకు, మైనార్టీ నేత ఇక్‌బాల్‌సింగ్‌ను పార్లమెంటరీ బోర్డులోకి తీసుకున్నారు. వీరితోపాటు కీలక నేతలతో టీంను సిద్ధం చేశారు. ఇందులో టాప్‌లో నరేంద్రమోదీ, రెండో స్థానంలో అమిత్‌షా, మూడో స్థానంలో జేపీ.నడ్డా ఉన్నారు. అయితే కీలకపాత్ర మాత్రం అమిత్‌షాదే. షా వ్యూహరచన చేసి నేరుగా నరేంద్రమోదీకే నివేదిస్తారు. నరేంద్రమోదీ సూచనలను జేపీ నడ్డా ద్వారా పార్టీ అమలు చేసేలా అమిత్‌షా చూసుకుంటారు. వీరు ముగ్గురు కాకుండా టీంలో మరో కీలక నేత బీఎల్‌.సంతోష్‌. ఈయన ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చారు. టీం ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. బీజేపీలో ఇది కీలక పదవి. ఆర్‌ఎస్‌ఎస్‌కు, బీజేపీని సమన్వయ పర్చడంలో సంతోష్‌ కీలకంగా వ్యవహరిస్తారు. 144 సీట్ల గుర్తింపు, వాటి ప్రొఫైల్, ఎలా గెలవొచ్చు అని దిశా నిర్దేశం చేసింది కూడా సంతోషే. ఇలా బీజేపీ పటిష్ట నాయకత్వంతో 2024కు జట్టును రెడీ చేసుకోగా కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీకి అధ్యక్షుడు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.

కీలకంగా మారుతున్న అస్సాం సీఎం…
బీజేపీలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్‌ బిశ్వశర్మ ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. ఈయన కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరినప్పటికీ పార్టీ సిద్దాంతాలను త్వరగా పుణికిపుచ్చుకున్నారు. ఈశాన్యభారంతోని 6 రాష్ట్రలు ఉండగా ఐదు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వాలను కూల్చే ప్రక్రియలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌తో పోటీపడుతున్నారు. ఈయన తర్వాత ధర్మేంద్రప్రదాన్, భూపేంద్రయాదవ్, సునీల్‌ బన్సల్‌ మిషన్‌ – 2024 టీంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ధర్మేంద్రప్రదాన్, భూపేంద్రయాదవ్‌ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. సునీల్‌ బన్సల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నేత. బెంగాల్‌ ఎన్నికలో బీజేపీని బలమైన శక్తిగా మార్గడంలో కీలకపాత్ర పోషించారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 2024లో తెలంగాణలో బీజేపీని గెలిపించే బాధ్యత కూడా అప్పగించారు. ఈ మూడు రాష్ట్రాల బాధ్యత సునీల్‌ బన్సల్‌ చూసుకుంటారు. ఇలా ఎవరికి వారు కీలక బాధ్యతలు తీసుకుని పార్టీని 2024కు ఎలా సిద్ధం చేయాలో వ్యూహ రచన చేస్తున్నారు.

BJP- 2024 Elections

modi , amit shah

కాంగ్రెస్‌లో కనిపించని సమన్వయం..
అప్రతిహత జైత్రయాత్రతో దూసుకుపోతున్న బీజేపీలో ఉన్న సమన్వయం కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. బీజేపీ టీం ఇప్పటి నుంచే రాష్ట్రాలకు వెళ్లి పని ప్రారంభించింది. కీలక నేతలంతా పార్టీ కార్యాలయాల్లో క్యాడర్‌ను సమన్వయం చేసే పనిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్‌లో ఇలాంటి లీడర్లు కనిపించడం లేదు. పార్టీని సమన్వయం చేయడం లేదు. పార్టీ కార్యాలయాలకు వెళ్లి సమావేశాలు నిర్వహించడం లేదు. ఎక్కడికైనా వెళితే హోటళ్లకు నాయకలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తద్వారా క్యాడర్‌లో విశ్వాసం నింపలేకపోతున్నారు. బీజేపీలో మాత్రం కీలక నేతల నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరూ పార్టీ కార్యాలయాలకు వెళ్లి క్షేత్రస్థాయి నుంచి పార్టీని సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీకి బలం కాగా, ఇలాంటి పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్‌ బలహీనతగా చెప్పవచ్చు.

Also Read:TV5 Sambasiva Rao: టీవీ5 సాంబశివరావుపై ఈడీ దాడులు..? బీజేపీ దెబ్బకు ఇకనైనా నోరు మూస్తాడా?

Tags