https://oktelugu.com/

Shanmukh Jaswanth: దీప్తితో బ్రేకప్: ఆస్పత్రి బెడ్ పై షణ్ముక్ జశ్వంత్.. సూసైడ్ అంటెప్టా? క్లారిటీ ఇదీ

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ తో పాపులర్ అయిన ఈ సోషల్ మీడియా సెన్షేషన్.. గత బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు టైటిల్ కొడుతాడని అందరూ భావించారు. కానీ అదే బిగ్ బాస్ అతడి కొంప ముంచింది. సిరీతో ఇతడి ఓవరాక్షన్ బిగ్ బాస్ టైటిల్ ను దూరం చేయగా.. తన ప్రేయసి దీప్తి సునయనతో బ్రేకప్ కు దారితీసింది. అందుకే బిగ్ బాస్ తర్వాత దీప్తితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 8, 2022 / 03:48 PM IST
    Follow us on

    Shanmukh Jaswanth: షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ తో పాపులర్ అయిన ఈ సోషల్ మీడియా సెన్షేషన్.. గత బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు టైటిల్ కొడుతాడని అందరూ భావించారు. కానీ అదే బిగ్ బాస్ అతడి కొంప ముంచింది. సిరీతో ఇతడి ఓవరాక్షన్ బిగ్ బాస్ టైటిల్ ను దూరం చేయగా.. తన ప్రేయసి దీప్తి సునయనతో బ్రేకప్ కు దారితీసింది.

    Shanmukh Jaswanth

    అందుకే బిగ్ బాస్ తర్వాత దీప్తితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన షణ్ముక్ జశ్వంత్ చాలా రోజులు సోషల్ మీడియాకు, యూట్యూబ్ కు దూరంగా ఉన్నాడు. యూట్యూబ్ లో ఏలాంటి వీడియోలు పెట్టకుండా సైలెంట్ అయ్యాడు.

    Also Read: Mahalakshmi- Ravinder: ఆ క్యూట్ సీరియల్ హీరోయిన్.. ఆ హాట్ నిర్మాతకు పెట్టిన కండీషన్ ఇదట.!

    మరికొద్ది రోజుల్లో జశ్వంత్ బర్త్ డే. ఈ క్రమంలోనే అతడు హాస్పిటల్ బెడ్ పై గ్లూకోజ్ ఎక్కించుకుంటూ చేతికి బీపీ మీటర్ పెట్టుకొని విషమ పరిస్థితుల్లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.దీంతో షణ్ముక్ కు ఏమైంది? అతడు ఎందుకు ఆస్పత్రి పాలయ్యాడు. దీప్తితో బ్రేకప్ తో ఏమైనా సూసైడ్ అంటెప్ట్ చేశాడా? అని అందరూ కంగారుపడి ఆరాతీశారు.

    Shanmukh Jaswanth

    ప్రస్తుతం కోలుకున్న షణ్ముక్ జశ్వంత్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. జిమ్ లో బాగా వ్యాయామం చేస్తున్నాడు. ఏమైందో తెలియదు కానీ.. హాస్పిటల్ బెడ్ మీద కనిపించాడు. తనే షేర్ చేశాడు. ‘పుట్టినరోజు నెల ఇది. దిష్టి తగిలినట్లుంది’ అని ఫొటోకు క్యాప్షన్ రాశాడు. అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడంతో కొద్దిసేపటికే తాను బాగానే ఉన్నానంటూ మరో పోస్ట్ పెట్టాడు. దీంతో అతడి ఫాలోవర్స్ ఊపిరి పీల్చుకున్నారు. షణ్ముక్ ఎందుకు ఆస్పత్రి పాలయ్యాడు? దీప్తి బ్రేకప్ బాధలో ఆత్మహత్యాయత్నం చేశాడా? అనారోగ్యానికి గల కారణమేంటన్నది తెలియరాలేదు.

    Also Read:Nithin- Nikhil- Nadda: నడ్డా కలవాలనుకున్నది నితిన్‌ని కాదు నిఖిల్‌నా… బీజేపీపై భారీగా మీమ్స్..!

    Tags