Ram Charan- Shankar Movie: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విజువల్స్ లీక్ అయ్యాయి. తాజాగా కొన్ని సన్నివేశాలు, సెట్స్ ఫొటోలు లీక్ అయ్యాయి అంటూ ఫ్యాన్స్ నెట్టింట ట్వీట్స్ చేస్తున్నారు. ఓ సాంగ్ షూట్ కోసం ఏర్పాటు చేసిన సెట్స్ ఫొటోలతో పాటు, ఓ మ్యూజిక్ బిట్‌ను పోస్ట్ చేసి లీక్ అయ్యాయని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఆ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ కూడా లీక్ అయ్యింది. మరి ఈ లీకుల విషయంలో నిర్మాత దిల్ రాజు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అసలకే మోసం వస్తోంది.
Ram Charan
ఏది ఏమైనా చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన పొలిటికల్ కథ డైరెక్టర్ శంకర్‌కు నచ్చింది. ఈ సినిమాకు కార్తిక్ కథ ఇవ్వగా ఈ చిత్రానికి దర్శకత్వం శంకర్ చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మేజర్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు. ఇక ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు.
Ram Charan
అన్నిటికి మించి ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. లార్డ్ ఆఫ్ రింగ్స్, ది విచ్చేర్, ది హాబిట్ సినిమాలకు వర్క్ చేసిన మేకప్ టీమ్ వేటా వర్క్ షాప్ ఈ సినిమాకు కూడా వర్క్ చేస్తున్నారు. చరణ్ ను చాలా కొత్తగా చూపించడానికి వీళ్లు లేటెస్ట్ పరికరాలను కూడా ఉపయోగించారు. పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని శంకర్ ఆశ పడుతున్నాడు. ఎలాగూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు. కాబట్టి.. ఈ సినిమాతో తన ఆశను తీర్చుకుంటాడేమో చూడాలి. కాకపోతే.. సినిమా లీకుల విషయంలో మాత్రం ఈ టీమ్ జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Anasuya Bharadwaj: మాజీ ప్రియుడుకు అనసూయ బర్త్ డే విషెస్.. వైరల్.. ఇంతకీ అతడెవరో తెలుసా?
#RC15 anna look college look🥰🥰🥰
Ram Charan anna @AlwaysRamCharan
Retweet for video pic.twitter.com/kIk167xnXG— Raj Charan 🚁 (@alwaysrajcharan) September 8, 2022