JP Nadda Slams YCP Govt: మా పథకాలు.. జగన్ పేర్లు.. పోటు పొడిచిన జేపీ నడ్డా

JP Nadda Slams YCP Govt: బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని భావిస్తోంది. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రముఖులను నియమిస్తోంది. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసే పనిలో పడింది. దీనికి గాను కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను రాష్ర్ట ప్రభుత్వాలు తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. దీంతో పార్టీ ప్రతిష్ట […]

Written By: Srinivas, Updated On : June 6, 2022 4:49 pm
Follow us on

JP Nadda Slams YCP Govt: బీజేపీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని భావిస్తోంది. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రముఖులను నియమిస్తోంది. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసే పనిలో పడింది. దీనికి గాను కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను రాష్ర్ట ప్రభుత్వాలు తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. దీంతో పార్టీ ప్రతిష్ట పెరిగేలా చూడాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు.

JP Nadda

బూత్ కమిటీల ప్రాతినిధ్యం పెరిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో అందరి భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని చూస్తోంది. అన్ని వర్గాల ప్రజలు అందులో ఉండేలా చూసుకోవాలని చెబుతోంది. దీని కోసం అందరి భాగస్వామ్యంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది. రాష్ట్రంలో 46 వేల పోలింగ్ బూతులు ఉండటంతో అందులో పని చేసేందుకు కార్యకర్తలను తీసుకోవాలని సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాల విషయంలో పార్టీ కార్యకర్తలు చురుకుగా ఉండాలని చెబుతోంది.

Also Read: Pawan Kalyan AP CM Candidate: బీజేపీ జాతీయ అధ్యక్షుడి రాక.. పవన్ కళ్యాణ్ ‘సీఎం క్యాండిటేట్’యేనా?

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆరోగ్య పథకం తీసుకొస్తే దాన్ని రాష్ట్రాలు తమ పథకంగా చెప్పుకుంటున్నాయి. దీన్ని ఆరోగ్య శ్రీ పథకంగా ఏపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. దీంతో కేంద్రం చేపడుతున్న పథకాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని తెలుస్తోంది. అందుకే కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అర్థమయ్యేలా చెప్పడంలో బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్రాలు పేర్లు మార్చి వాటి గొప్పలుగా చెప్పుకుంటున్నాయి. దీంతో కేంద్రం చేసిన పనికి రాష్ర్టాలు ఫలితాలు అనుభవిస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా కేంద్ర పథకాలను కాపీ కొట్టి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. దీంతో కేంద్రం ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఇక ఉపేక్షించేది లేదు. మన పథకాల గురించి మనమే ప్రచారం చేసుకోవాలి. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది.

JP Nadda Slams YCP Govt

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయవాడలో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశంలో మాట్లాడారు. పార్టీని పటిష్టం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని సూచించారు. ఈ మేరకు కార్యకర్తలు మనోనిబ్బరంతో పనిచేయాల్సి ఉంటుంది. పార్టీ భవిష్యత్ ను దిశానిర్దేశం చేసే విధంగా ఐక్యంగా పనిచేయాలి. అప్పుడే విజయం మన సొంతం అవుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతి ఏటా రూ. 6 వేలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేయాలి. కేంద్రం తీసుకొచ్చిన పథకాలు అమలు చేసే తీరున విడమర్చి చెప్పాలి. అప్పుడే కేంద్రం చేపడుతున్న పథకాలు ప్రజల్లోకి వెళతాయి. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేసి పార్టీ ప్రతిష్టను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read:AP Political Alliance: అధికారం చెరిసగం.. తెరపైకి 50:50 ఫార్ములా

Tags