Laser Light: రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాని చెబుతూ ఉంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు ఆగడం లేదు. బాధాకరమైన విషయమేంటంటే ప్రపంచంలో భారత్ లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో త్రీడీ పెయింటింగ్ ద్వారా డ్రైవర్లను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే చైనా దేశం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోడ్డుపై లేజర్ లైట్ ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రమాదాలు జరుగుతాయని అంటోంది. ఆ వివరాల్లోకి వెళితే.
హైవే రోడ్డుపై ప్రమాదాలను నివారించాలని ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. అయితే చైనా ప్రభుత్వం తాజాగా మల్టీ కలర్ లేజర్ షో ను ఏర్పాటు చేసింది. వీటిని హైవేలపై అమర్చింది. ఒకచోట వీటిని పెడితే రెండు కిలోమీటర్ల వరకు కాంతిని ప్రసరింపచేస్తాయి. అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రమదేశంలో వీటిని అమర్చారు. వివిధ రంగుల్లో కాంతిని వెదజల్లడం ద్వారా డ్రైవర్ ను అప్రమత్తం చేసి వాహనాలను జాగ్రత్తగా నడుపుతారని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదే పద్ధతిని గతంలో ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు చైనా దీనిని అమలు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ విధానంపై భిన్న రకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు దీనిని ప్రశంసిస్తుండగా..మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. రోడ్డుపై ఇలా లేజర్ లైట్ ను అమర్చడం వల్ల డ్రైవర్ దృష్టి మరలుతుందని అంటున్నారు. డ్రైవర్ రోడ్డుపై కాకుండా లేజర్ లైట్ పై ఫోకస్ పెడుతారని కామెంట్ పెడుతున్నారు.
దీంతో భారత్ లోనూ ఈ విధానం వస్తుందా? అని కొందరు చర్చలు పెడుతున్నారు. ప్రపంచంలోని భారత్ లోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగుతుండడం బాధాకరం. విహార యాత్రలకు వెళ్లేవారు ఫ్యామిలీతో సరదాగా గడిపిన తరువాత అలసిపోతారు. ఇలాంటి సమయంలో కాసేపు నిద్రించిన తరువాత వాహనం నడిపితే మేలు. అలాగే ట్రక్కులు నడిపేవారు సైతం నిద్ర ముంచుకొస్తే కాసేపు పక్కకు ఆపి నిద్రపోవాలని సూచిస్తున్నారు.