spot_img
Homeజాతీయ వార్తలుLok Sabha Election 2024: దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లపై బిజెపి గురి

Lok Sabha Election 2024: దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లపై బిజెపి గురి

Lok Sabha Election 2024: దక్షిణాధి రాష్ట్రాల్లో బిజెపి పరిస్థితి ఏంటి? గత ఎన్నికల కంటే పుంజుకుంటుందా? లేకుంటే సీట్లు తగ్గుతాయా? అదే జరిగితే బిజెపి లక్ష్యం 370 సీట్లు దాటుతాయా? లేదా? ఇప్పుడు ఇదే చర్చగా మారింది. దక్షిణాధిన ఉన్న 130 స్థానాల్లో.. బిజెపి 29 స్థానాలకే పరిమితం అయ్యింది. కానీ ఈ ఎన్నికల్లోసగం సీట్లైనా దక్కించుకోవాలని బిజెపి భావిస్తోంది.కర్ణాటక,ఏపీ,తమిళనాడులో పొత్తులు కుదుర్చుకుంది. తెలంగాణ, కేరళలో ఒంటరి పోరు చేస్తోంది..

గత ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో మూడింట అసలు బిజెపి ఖాతా తెరవలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. కర్ణాటకలో మాత్రం 28 సీట్లకు గాను 25 స్థానాలను దక్కించుకుంది. తెలంగాణలో 17 స్థానాలు గాను నాలుగింట విజయం సాధించింది. ఈ లెక్కన నాలుగు దక్షిణ రాష్ట్రాల్లో బిజెపి సాధించింది 29 స్థానాలే. అంటే ఇంకా 101 స్థానాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేనట్టే.

ఎన్డీఏ పరంగా 400 సీట్లు, బిజెపి పరంగా 370 సీట్లు సాధించాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు ఎన్నికల కంటే బిజెపికి ఆదరణ తగ్గింది అన్న సంకేతాలు వస్తున్నాయి. తొలి మూడు విడతల పోలింగ్లో సైతం గణాంకాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దీంతో బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అందుకే ప్రధాని మోదీ తో పాటు అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. భాగస్వామ్య పార్టీలతో కలిసి ప్రచారం చేస్తున్నారు.

గత పదేళ్లలో ప్రధాని మోదీ 120 సార్లు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే అందులో 64 అధికారిక కార్యక్రమాలు కాగా.. 56 పార్టీ పర్యటనలు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.గత ఎన్నికల్లో ఏపీలో బిజెపి దారుణంగా ఓడిపోయింది. కేవలం 0.97 ఓట్లు మాత్రమే లభించాయి. కేరళలో 12 శాతం ఓట్లు వచ్చిన సీట్లు దక్కలేదు. తమిళనాడులో 3.6% ఓట్లు వచ్చాయి. ఈసారి తెలంగాణలో 10 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది బిజెపి. కర్ణాటకలో సైతం జిడిఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఏపీలో టిడిపి,జనసేన తో కలిసి బరిలో దిగింది. దక్షిణాది రాష్ట్రాల్లో 60 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో 300కు పైగా స్థానాలు సాధిస్తే.. తాము అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతామని బిజెపి భావిస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version