https://oktelugu.com/

Zodiac Signs: వృషభ రాశిలోకి సూర్యుడితో అశాంతి… తీవ్ర పరిణామాలు

సూర్య భగవానుడు ప్రస్తుతం మేష రాశిలో ఉన్నాడు. అయితే ఈ నెల 14 వ తేదీ నుంచి సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నెలలో వస్తున్న అక్షయ తృతీయ మూడు రోజుల తరువాత మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 8, 2024 / 01:28 PM IST

    Zodiac Signs

    Follow us on

    Zodiac Signs: సాధారణంగా గ్రహాలు, వాటి స్థితిగతులను చాలా మంది తెలుసుకుంటుంటారు. గ్రహాలకు రాజుగా ఉన్న సూర్యుడు తన రాశిని ఎప్పటికప్పుడు మారుస్తాడన్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే సూర్యుడు తన రాశిని మళ్లీ మార్చుకుని వేరే రాశిలోకి వెళ్లనున్నాడు. అయితే ఈ ప్రభావంతో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలు ఆదిత్యుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు.. దాని వలన ఎలాంటి ప్రభావాలు ఉండనున్నాయనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

    సూర్య భగవానుడు ప్రస్తుతం మేష రాశిలో ఉన్నాడు. అయితే ఈ నెల 14 వ తేదీ నుంచి సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నెలలో వస్తున్న అక్షయ తృతీయ మూడు రోజుల తరువాత మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. కాగా వృషభ రాశిలోకి ఆదిత్యుని సంచారంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రభావాలు కనిపిస్తాయని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు.

    వృషభ రాశిలో సూర్యుని సంచారం ఎఫెక్ట్ ఎక్కువగా రాజకీయాలపై కనిపిస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఆశించిన మేరకు పని చేయదంటున్న నిపుణులు సూర్య భగవానుడు ఒకే ఇంటిలో ఉండడం వలన సర్కార్ సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే యావత్ ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాజకీయ అశాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.

    అలాగే వృషభ రాశిలోకి సూర్య సంచారం వలన బంగారం ధరలపై కూడా కీలక ప్రభావం పడే అవకాశం ఉందంట. ఎడ్ టెక్ సంస్థలు మరియు విద్యాసంస్థలు బాగా పని చేసే అవకాశం ఉంది. దీని వలన టీచర్స్ తో పాటు ఆధ్యాత్మిక బోధకులకు, కళాకారులు మరియు రచయితలకు మంచి కాలమని ఆధ్యాత్మిక నిపుణులు తెలియజేస్తున్నారు.

    దాంతో పాటుగా రైతాంగానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మంచి దిగుబడులు, పంటలతో వ్యవసాయ రంగం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా వైద్య రంగంలోనూ గణనీయమైన పురోగతి కనిపిస్తుందని తెలియజేస్తున్నారు.