
Uttar Pradesh: వచ్చే ఏడాది జరిగే అయిదు స్టేట్ల ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పెట్రో ధరలు తగ్గించింది. కానీ ఇటీవల కాలంలో లఖీంపూర్ ఘటన బీజేపీకి మరింత షాక్ ఇస్తోంది. ఈ ఘటనతో అటు సిక్కులు, ఇటు బ్రాహ్మణులు బీజేపీపై ఆగ్రహం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం గగనంగానే కనిపిస్తోంది. దీంతో పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నా అవి సఫలం కావడం లేదు.
యూపీ(Uttar Pradesh)లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు గాను అన్ని దారులు అన్వేషిస్తోంది. కానీ అన్ని అంశాలు వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో బీజేపీ ఎలాగైనా గట్టెక్కాలని తపిస్తోంది. కుల, మత సమీకరణల నేపథ్యంలో ప్రత్యేక వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతోంది.
లఖీంపూర్ ఘటనలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపై కారు పోనిచ్చి వారి మరణానికి కారకుడయ్యాడు. దీంతో బీజేపీపై ద్వేషం పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఈ ఘటన పార్టీ ప్రతిష్టను దిగజార్చింది. విజయావకాశాలను దెబ్బ తీస్తోంది. నేతలకు అదే భయం పట్టుకుంది.
ఈ వ్యవహారంలో ఆశిష్ మిశ్రా పాత్ర ఉందన తేలడంతో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతోంది. ఆశిష్ మిశ్రా బ్రాహ్మణుడు కావడంతోనే సిక్కులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేసి వారి మరణానికి కారకుడయ్యాడని ఓ వాదన వినిపిస్తోంది. దీంతో రెండు కులాల మధ్య దూరం పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రతిబంధకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: తెలంగాణల మరిన్ని ఉప ఎన్నికలకు బీజేపీ సమాయత్తం?
ప్రమాణ స్వీకారం చేసి.. తొడగొట్టి మరీ.. కేసీఆర్ కు ఈటల సంచలన సవాల్