
Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కారణంగా ఎన్టీఆర్ మూడేళ్ళ పాటు డేట్లు అన్ని ఆ సినిమాకే ఇచ్చేశాడు. అయితే, యంగ్ టైగర్ మొత్తానికి మూడేళ్ళ తర్వాత ఆ సినిమా నుంచి బయటకు వచ్చి.. మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఎలాగూ ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న విడుదల కాబోతుంది. ఇక రీసెంట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సంబంధించిన షూటింగ్ కూడా ఎన్టీఆర్ ఇప్పటికే పూర్తి చేశాడు.

కాబట్టి.. త్వరలోనే తన పూర్తి ఫోకస్ ను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న తన 30వ సినిమా పై పెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్(Jr NTR) పాత్ర పై ఒక రూమర్ ప్రస్తుతం సినిమా ఇన్ సైడ్ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాంగ్రీ యంగ్ మ్యాన్ పోలీస్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఫుల్ ఫైర్ బ్రాండ్ గా ఎన్టీఆర్ మాస్ ఎలిమెంట్స్ తో ఇరగదీస్తాడని అంటున్నారు.
మొత్తానికి ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు అన్నమాట. అన్నట్టు ఈ సినిమా గురించి రోజుకో రూమర్ వినిపిస్తూనే ఉంది. ఆ మధ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించబోతున్నాడని అన్నారు. అలాగే విలన్ కి రైట్ హ్యాండ్ లా కమెడియన్ సునీల్ కూడా వెరీ వైలెంట్ రోల్ కనిపించబోతున్నాడని టాక్ నడిచింది.
విలన్ పాత్రల కోసం ప్రస్తుతం సునీల్ తాపత్రయం పడుతున్నాడట. నా కోసం ఒక పవర్ ఫుల్ విలన్ పాత్ర రాయండి అంటూ అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాడట. సునీల్ రిక్వెస్ట్ కారణంగానే కొరటాల సునీల్ కోసం ఒక రోల్ రాసినట్లు తెలుస్తోంది. చాలామందికి తెలియదు, సునీల్ కి కొరటాల కి మధ్య మంచి స్నేహం ఉంది.
కొరటాల మొదటి సినిమా భద్ర నుండే వీరి మధ్య సాన్నిహిత్యం బిల్డ్ అవుతూ వచ్చింది. అందుకే సునీల్ విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కొరటాల ఓ అవకాశం ఇవ్వబోతున్నాడు. సునీల్ కూడా విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కలిసి రావడం లేదు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి ఓల్డ్ స్టైల్‌తో కనిపించనున్నారా!