Sara Alikhan: సారా అలీఖాన్​కు స్పెషల్​ గిఫ్ట్​ ఇచ్చిన అభిమాని.. ఎలా రియాక్ట్​ అయ్యిందో తెలుసా?

Sara Alikhan: బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరిగా ప్రస్తుతం ముందుకు దూసుకెళ్తున్ హీరోయిన్లలో సారా అలీఖాన్​ ఒకరు. కెరీర్​లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. సోషల్​మీడియాలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్​ ఉంది. సైఫ్​ అలీఖాన్ వారసురాలిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. తనకంట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేదార్​నాథ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సారా.. అందులో తన నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఆ తర్వాత రణవీర్​ సింగ్​తో కలిసి నటించిన సింబా సినిమా.. సూపర్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 11, 2021 4:50 pm
Follow us on

Sara Alikhan: బాలీవుడ్ అగ్రతారల్లో ఒకరిగా ప్రస్తుతం ముందుకు దూసుకెళ్తున్ హీరోయిన్లలో సారా అలీఖాన్​ ఒకరు. కెరీర్​లో తక్కువ సినిమాలే చేసినప్పటికీ.. సోషల్​మీడియాలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్​ ఉంది. సైఫ్​ అలీఖాన్ వారసురాలిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి.. తనకంట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేదార్​నాథ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన సారా.. అందులో తన నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఆ తర్వాత రణవీర్​ సింగ్​తో కలిసి నటించిన సింబా సినిమా.. సూపర్​ హిట్​ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం వరుస ఆఫర్లతో అగ్రకథానాయికల్లో ఒకరిగా దూసుకుపోయింది.

ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్​ మీడియాలోనూ మంచి యాక్టీవ్​గా ఉంటోంది. అప్పుడప్పుడు అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ.. వారిని అలరిస్తుంటుంది.  తాజాగా ముంబైలో తన ఫ్యాన్స్‏ను కలుసుకున్న సారాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ అభిమాని ఆమెకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ సమోసా పావ్‏ను ఇస్తున్నట్లుగా కనిపించింది. సమోసా తీసుకుని క్యూట్‏గా నవ్వుతూ ఆ అభిమానికి థ్యాంక్స్ చెప్పింది.

వీడియోలో సారాతో పాటు హీరో విక్కీ కౌషల్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. సారా చివరగా వరున్​ధావన్ నటించిన కూలీ నెంబర్​.1 సినిమాలో నటించింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్​తో కలిసి సినిమాలు నటిస్తోంది.