Bilawal Bhutto statement: ఆపరేషన్ సిందూర్ ఆగినా.. భారత్–పాకిస్తాన్ మధ్య మాటల యద్ధం ఆగడం లేదు. ఆ దేశ సైనికాధికారి ఆసిఫ్ మునీర్, ప్రధాని షహబాజ్ షరీఫ్ తరచూ తప్పుడు ప్రకటనలతో కవ్విస్తున్నారు. ప్రపంచ దేశాలదృష్టితో తాము మంచివాళ్లం అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బిలావర్‌భుట్టో జద్దారీతో మరో సంచలన ప్రకటన చేయించారు. దీనిపై ఇప్పుడు భారత్, పాకిస్తాన్‌లో చర్చ జరుగుతోంది.
బిలావల్ భుట్టో జర్దారీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి. పాకిస్తాన్‌లోని కరుడుగట్టిన ఉగ్రవాదులు హఫీజ్ సయీద్. మసూద్ అజహర్‌ను భారత్‌కు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, సింధూ నది జలాల విషయంలో భారత్ సహకరిస్తేనే ఈ ఆఫర్ అమలవుతుందని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెనుక రాజకీయ, దౌత్యపరమైన, వ్యూహాత్మక లక్ష్యాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
సింధూ జల ఒప్పందం రద్దుతో కరువు..
భారత్ సింధూ జల ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత, నీటి ప్రవాహాన్ని నియంత్రించే శక్తిని ఉపయోగించి పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచింది. పాకిస్తాన్ వ్యవసాయం 90% సింధూ నది వ్యవస్థపై ఆధారపడి ఉంది, నీటి కొరత వల్ల ఆ దేశంలో కరువు, ఆహార అభద్రత, మరియు ఆర్థిక అస్థిరత పెరిగాయి. భారత్ నీటి నిల్వ సౌకర్యాలు పరిమితంగా ఉన్నప్పటికీ, నీటి ప్రవాహాన్ని ఎప్పుడు ఆపాలి లేదా విడుదల చేయాలనే నిర్ణయం తన చేతుల్లో ఉంచుకుంది. ఇది పాకిస్తాన్‌ను దౌత్యపరంగా చర్చలకు రప్పించే వ్యూహంగా కనిపిస్తుంది.
పాకిస్తాన్ ఎత్తుగడ..
అయితే బిలావల్ భుట్టో అధికారంలో లేనప్పటికీ, ఆయన ప్రకటన పాకిస్తాన్ సైన్యం, ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ మద్దతుతో ఉన్నట్లు సందేహాలు ఉన్నాయి. ఈ ప్రకటన భారత్‌తో సంబంధాలను మెరుగుపరచడానికి లేదా సింధూ జల ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఒక రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తుంది. ఈ ప్రకటనను హమాస్ వంటి సంస్థలు శాంతి చర్చలను సమయం కొనుగోలు చేయడానికి ఉపయోగించే వ్యూహంతో పోల్చవచ్చు. పాకిస్తాన్ ఈ ఆఫర్ ద్వారా భారత్‌ను చర్చల బాటలోకి తీసుకురావడానికి లేదా అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
Also Read: ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీ ప్రకటన.. భారతదేశంలో అలాంటి ప్రయోగం సాధ్యమా?
బిలావల్ ప్రకటనలో విశ్వసనీయత ఎంత..
మరోవైపు బిలావల్ భుట్టో అధికారంలో లేని వ్యక్తి. ఈ ఆఫర్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం లేదా సైన్యం నుంచి అధికారిక ధృవీకరణ లేదు. ఇది దాని విశ్వసనీయతను సందేహాస్పదం చేస్తుంది. పాకిస్తాన్ గతంలో ఉగ్రవాదులు తమ దేశంలో లేరని లేదా జైల్లో ఉన్నారని పదేపదే చెప్పినప్పటికీ, హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. భారత్ అందించిన ఆధారాలపై కూడా పాకిస్తాన్ చర్యలు తీసుకోలేదు. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ, లష్కర్–ఎ–తాయిబా, జైష్–ఎ–మహమ్మద్ వంటి సంస్థలకు మద్దతు ఇస్తున్నాయని అంతర్జాతీయంగా ఆరోపణలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం..
పాకిస్తాన్ ప్రధాని షబాజ్ షరీఫ్, సైన్యాధికారి ఆసిఫ్ మునీర్ మధ్య అభిప్రాయ బేధాలు, అలాగే సైన్యం, వైమానిక దళం మధ్య ఘర్షణలు ఉన్నాయని సమాచారం. ఈ చీలికలు బిలావల్ ప్రకటనను సైన్యం యొక్క వ్యూహంగా చూడడానికి కారణమవుతున్నాయి. పాకిస్తాన్ గతంలో ఉగ్రవాదులను తమ అవసరాలు తీరిన తర్వాత వదిలేసిన చరిత్ర ఉంది. హఫీజ్ సయీద్, మసూద్ అజహర్‌ను అప్పగించడం ద్వారా, పాకిస్తాన్ తమ ఉగ్రవాద వ్యతిరేక విధానాన్ని చూపించే ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ఆపరేషన్ సిందూర్ ప్రస్తుతం పాస్ మోడ్‌లో ఉంది. మళ్లీ మొదలు పెట్టకుండా ఉండేందుకు కూడా ఇలా ఎత్తుగడ వేసి ఉంటుందని సమాచారం.
Also Read: మోదీ గేమ్ స్టార్ట్.. టర్కీ, అజర్‌బైజాన్, చైనాకు చెక్‌మేట్!
భారత్ స్పందన ఎలా ఉంటుంది
భారత్ ఈ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ గతంలో ఇలాంటి హామీలను ఉల్లంఘించిన చరిత్ర ఉంది. అధికారిక ధృవీకరణ, ఉగ్రవాదులపై కఠిన చర్యలు లేకుండా ఈ ఆఫర్‌ను నమ్మడం కష్టం. భారత్ తన నీటి నియంత్రణ శక్తిని ఉపయోగించి, పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజమైన చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయవచ్చు. భారత్ ఈ ఆఫర్‌ను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి, పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచవచ్చు, ముఖ్యంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయవచ్చు.