Masterstroke by Modi govt as India: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌కు నిజమై మిత్రులు ఎవరో.. శత్రువులు ఎవరో తేలిపోయింది. మన వారు అనుకుని మానవత్వంతో సాయం చేసిన వారు కూడా మన శత్రువులకు ఆయుధాలు ఇచ్చారు. ఇక మనతో శత్రుత్వం ఉన్నవారిగురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఏది ఏమైనా ఆపరేషన్ సిందూర్ మన ఆయుధ శక్తిని ప్రపంచానికి చాటింది. సీజ్ ఫైర్ తర్వాత ఇప్పుడు భారత్ మన శత్రుదేశాలపై పోకస్ పెట్టింది. ప్రధాని నరేంద్రమోదీ గేమ్ స్టార్ట్ చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ భౌగోళిక రాజకీయాల్లో కీలక వ్యూహాలతో టర్కీ, అజర్‌బైజాన్, చైనాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపడుతోంది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న ఈ దేశాలను ఎదుర్కొనేందుకు గ్రీస్, అర్మేనియా, సైప్రస్, తైవాన్‌లతో సంబంధాలను బలోపేతం చేస్తూ, ఆయుధ సహకారం, దౌత్య చర్యల ద్వారా శక్తివంతమైన కూటమిని రూపొందిస్తోంది.
గ్రీస్‌కు బ్రహ్మోస్..
భారత్, గ్రీస్‌తో రక్షణ సహకారాన్ని పెంచుతూ, బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూస్ మిసైల్స్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూస్ మిసైల్ సరఫరా చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ మిసైల్స్, 300–1000 కి.మీ. రేంజ్, మాక్ 2.8–3.0 వేగంతో టర్కీ నావికాదళంపై గణనీయమైన బెదిరింపును సృష్టిస్తాయని గ్రీక్ నిపుణులు భావిస్తున్నారు. గ్రీస్–టర్కీ మధ్య దీర్ఘకాల సంఘర్షణ నేపథ్యంలో, ఈ ఒప్పందం టర్కీలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. టర్కీ మీడియా ఈ చర్యను ‘‘భారత్ గ్రీస్ కార్డు’’గా వర్ణిస్తూ, దీనిని పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చినందుకు భారత్ యొక్క ‘‘ప్రతీకార చర్య’’గా చిత్రీకరిస్తోంది.
Also Read: చైనాకు చికాకు తెప్పించే పని చేసిన మోడీ
అర్మేనియాకు ఆయుధ సహకారం..
అజర్‌బైజాన్–అర్మేనియా మధ్య నాగోర్నో–కరాబాఖ్ సంఘర్షణలో అజర్‌బైజాన్‌కు టర్కీ, పాకిస్తాన్ మద్దతు ఇవ్వడంతో, భారత్ అర్మేనియాకు ఆకాశ్–1ఎస్, పినాకా రాకెట్ లాంచర్లు, స్వాతి రాడార్లు వంటి ఆయుధాలను సరఫరా చేస్తోంది. 2020 నుంచి ఈ సహకారం ఊపందుకుంది, ఇది అజర్‌బైజాన్ సైనిక ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయెవ్ ఈ ఆయుధ సరఫరాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత్, ఫ్రాన్స్, గ్రీస్‌లు అర్మేనియాను ఆయుధాలతో బలోపేతం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య అజర్‌బైజాన్‌తో పాటు టర్కీ, పాకిస్తాన్‌లకు పరోక్షంగా ఒత్తిడిని కలిగిస్తోంది.
సైప్రస్‌తో దౌత్య సంబంధాలు..
2025లో ప్రధాని మోదీ సైప్రస్ సందర్శన, 20 ఏళ్లలో భారత ప్రధాని ఈ దేశానికి చేసిన మొదటి పర్యటనగా గుర్తించబడింది. 1974లో టర్కీ ఆక్రమణ తర్వాత సైప్రస్‌లో ఏర్పడిన ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్‌ను కేవలం టర్కీ మాత్రమే గుర్తిస్తుంది. మోదీ సందర్శన సమయంలో, టర్కీ నియంత్రిత ఉత్తర సైప్రస్ నేపథ్యంలో ఫొటో తీయించడం టర్కీని షాక్‌కు గురిచేసింది. సైప్రస్ భారత్ భౌగోళిక రాజకీయ వ్యూహంలో మధ్యధరా, యూరోపియన్ మార్కెట్లకు గేట్‌వేగా మారుతోంది.
తైవాన్‌తో సంబంధాలు..
చైనా–తైవాన్ సంఘర్షణ సంభావ్యత నేపథ్యంలో, భారత్ తైవాన్‌తో సంబంధాలను బలోపేతం చేస్తోంది. అమెరికా ఇప్పటికే తైవాన్‌కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో, భారత్ కూడా తైవాన్‌కు అండగా నిలవడం ద్వారా చైనాకు వ్యూహాత్మక ఒత్తిడిని కలిగిస్తోంది. ఇది చైనా ప్రాంతీయ ఆధిపత్యాన్ని సవాలు చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో. భారత్ చర్య చైనాకు గణనీయమైన నష్టాన్ని కలిగించే సామర్థ్యం కలిగి ఉంది. ఎందుకంటే ఇది చైనా సైనిక, ఆర్థిక వ్యూహాలను బలహీనపరుస్తుంది.
Also Read: భారత ఆయుధాలకు డిమాండ్.. మోడీ టూర్ల వెనుక పెద్ద ప్లానింగే..
భారత్ దెబ్బ అదుర్స్..
టర్కీ, పాకిస్తాన్ మిత్రదేశంగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు బయరాక్తార్ టీబీ2 డ్రోన్లను సరఫరా చేసింది. ఈ డ్రోన్లను భారత్ సమర్థవంతంగా నాశనం చేసినప్పటికీ, టర్కీ మద్దతు భారత్–టర్కీ సంబంధాలను మరింత దిగజార్చింది. దీనికి ప్రతీకారంగా, భారత్ టర్కీ ప్రాంతీయ ప్రత్యర్థులైన గ్రీస్, సైప్రస్, అర్మేనియాలతో సంబంధాలను బలోపేతం చేస్తోంది. అదనంగా, టర్కీతో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయడం, టర్కీ పర్యాటక రంగంపై బహిష్కరణలను విధించడం వంటి చర్యలు టర్కీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.