Most Useful Websites: చేతిలోకి మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి అవసరం కొన్ని యాప్ లేదా వెబ్సైట్ ద్వారా తీర్చుకుంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఆన్లైన్లో వాటి గురించి తెలుసుకుంటూ పరిష్కరించుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని నిజమైన వెబ్సైట్లో గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పర్సనల్ కు సంబంధించిన డీటెయిల్స్.. అలాగే కంప్యూటర్ కి సంబంధించిన రిపైర్స్.. ఇలా కొన్ని విషయాలు తెలవడానికి ప్రత్యేకంగా వెబ్సైట్లో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నాలుగు వెబ్సైట్ ల గురించి తెలుసుకోవాలి. ఈ వెబ్సైట్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని ఉందా..?
వీటిలో మొదటిది super logout. Google లోకి వెళ్లి సూపర్ లాగౌట్ అని టైప్ చేయాలి. ఇప్పుడు ముందుగా డిస్ప్లే అయ్యే వెబ్ పేజీని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు తెలియకుండానే కొన్ని వెబ్సైట్లో లాగిన్ అయి ఉంటారు. అయితే క్రోమ్లో మొత్తం ఎన్ని వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నారో ఇందులో చూపిస్తుంది. వీటిలో మీకు అవసరం లేని వాటిని లాగౌట్ చేసుకోవచ్చు. లేదా మొత్తం ఒకేసారి లాగ్ అవుట్ చేసుకొని.. అవసరమున్న వాటికి మాత్రమే లాగిన్ అయితే సరిపోతుంది. ఇలా ఈ సూపర్ లాగౌట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మరో ఉపయోగపడే వెబ్సైట్ Ifixit. Google లోకి వెళ్లి దీనిని టైప్ చేయగానే ముందుగా ఒక వెబ్సైట్ వస్తుంది. ఇందులోకి వెళ్లి find my device అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. మీకు కంప్యూటర్ లేదా లాప్టాప్ ఉంటే అందులో ఏవైనా సమస్యలు ఉన్నా.. ఈ వెబ్సైట్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీకు సంబంధించిన లాప్టాప్ లేదా కంప్యూటర్ ని ఇందులో ఓపెన్ చేసి ఏ సమస్య ఉందో టైప్ చేయాలి. దీంతో దానికి పరిష్కారం దొరుకుతుంది. కేవలం కంప్యూటర్లకు సంబంధించిన విషయం మాత్రమే కాకుండా ఇతర మెడికల్ సర్వీస్, హౌస్ హోల్డ్ సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించుకోవచ్చు.
మూడోది face check.id. ఈ వెబ్సైట్ ద్వారా ఒక వ్యక్తికి ఎన్ని సోషల్ మీడియా అకౌంట్లో ఉన్నాయి? అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎవరి సోషల్ మీడియా అకౌంట్లో తెలుసుకోవాలని అనుకుంటున్నారో..? వారి ఫోటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వారికి సంబంధించిన డూప్లికేట్ ఫోటోలు లేదా ఎన్ని ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేశారో అన్ని కనిపిస్తాయి. దీంతో మొత్తం సమాచారాన్ని రాబట్టుకోవచ్చు.
నాలుగో ఉపయోగపడే వెబ్సైట్ learnvarn.com. ఈ వెబ్సైట్.. ఏదైనా కోర్సు నేర్చుకోవడానికి అయినా.. లేదా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి అయిన ఉపయోగపడుతుంది. అయితే ఇందులో కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా తెలుగులోనూ కూడా సమాచారం అందుతుంది. ఉదాహరణకు వెబ్ డిజైన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఇందులో పూర్తి సమాచారం ఉంటుంది. ఇందులో మొత్తం 150 కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటిని నేర్చుకోవడానికి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇలా నాలుగు వెబ్సైట్లు అన్ని రకాలుగా ఉపయోగపడే అవకాశం ఉంది.