https://oktelugu.com/

పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..: కేసీఆర్‌‌ డిమాండ్‌

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నను కేసీఆర్ స్మరించుకున్నారు. అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. నిరంత‌ర సంస్కర‌ణ శీలిగా దేశ చ‌రిత్రలో పీవీ చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. ఆర్థిక‌, విద్య, భూ ప‌రిపాల‌న త‌దిత‌ర రంగాల‌లో పీవీ ప్రవేశ‌పెట్టి అమ‌లు చేసిన సంస్కర‌ణ‌ల ఫ‌లితాన్ని నేడు భార‌త‌దేశం అనుభ‌విస్తోంద‌ని కేసీఆర్ అన్నారు. Also Read: జగన్‌.. మరో చారిత్రక నిర్ణయం […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 23, 2020 3:31 pm
    Follow us on

    KCR
    భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నను కేసీఆర్ స్మరించుకున్నారు. అనంత‌రం కేసీఆర్ మాట్లాడుతూ.. నిరంత‌ర సంస్కర‌ణ శీలిగా దేశ చ‌రిత్రలో పీవీ చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. ఆర్థిక‌, విద్య, భూ ప‌రిపాల‌న త‌దిత‌ర రంగాల‌లో పీవీ ప్రవేశ‌పెట్టి అమ‌లు చేసిన సంస్కర‌ణ‌ల ఫ‌లితాన్ని నేడు భార‌త‌దేశం అనుభ‌విస్తోంద‌ని కేసీఆర్ అన్నారు.

    Also Read: జగన్‌.. మరో చారిత్రక నిర్ణయం

    అంత‌ర్గత భ‌ద్రత వ్యవ‌హారాల్లోనూ, విదేశాంగ వ్యవ‌హారాల్లోనూ మాజీ ప్రధాని అవ‌లంబిస్తున్న వైఖ‌రి, దౌత్యనీతి భార‌తదేశ స‌మ‌గ్రత‌ను, సార్వభౌమాత్వాన్ని ప‌టిష్ట ప‌రిచింద‌ని కొనియాడారు. బ‌హు భాషావేత్తగా, బ‌హుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప ప‌రిపాల‌కుడిగా అనేక రంగాల్లో పీవీ న‌ర‌సింహారావు విశిష్ట సేవ‌లు అందించార‌ని అన్నారు. ఇలాంటి సేవ‌లు అందించిన పీవీకి ఘ‌న‌మైన నివాళి అర్పించేందుకే శ‌త‌జ‌యంతి ఉత్సవాల‌ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో బాధ్యత‌తో నిర్వహిస్తోంద‌ని గుర్తు చేశారు.

    Also Read: అచ్చెన్నాయుడు, రామానాయుడుకు నోటీసులు

    పీవీ న‌ర‌సింహారావు చేసిన సంస్కర‌ణ‌లు, ఆలోచ‌న‌లు తెలంగాణ, దేశ ప్రజ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని రాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామ‌న్నారు. అలాగే పీవీ పేరుతో స్టాంప్‌ను విడుద‌ల చేయాల‌ని కేంద్రాన్ని కోరుతామ‌ని అన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్