https://oktelugu.com/

ప్రేమికుల ప్రాణాలు తీసిన వయసు

సహజంగా భార్యాభర్తల్లో భర్త ఏజ్‌ కామన్‌గా పెద్దగా ఉంటుంది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు పెద్దగా చూసుకొనే పెళ్లిళ్లు చేస్తుంటారు. సెంటిమెంట్‌ పరంగా ఎన్ని కారణాలు చెప్పినా అదే అనాదిగా కొనసాగుతూ వస్తోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మాయి ఒకట్రెండు సంవత్సరాలు పెద్ద అయి ఉంటుంది. కానీ.. అమ్మాయి వయసు 21 ఉండి.. అబ్బాయి వయసు 15 ఏళ్లు మాత్ర ఉంటే..? సరిగ్గా ఇక్కడ ఓ ప్రేమజంట ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది. Also Read: పీవీకి భారతరత్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 23, 2020 3:35 pm
    Follow us on

    Lovers
    సహజంగా భార్యాభర్తల్లో భర్త ఏజ్‌ కామన్‌గా పెద్దగా ఉంటుంది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు పెద్దగా చూసుకొనే పెళ్లిళ్లు చేస్తుంటారు. సెంటిమెంట్‌ పరంగా ఎన్ని కారణాలు చెప్పినా అదే అనాదిగా కొనసాగుతూ వస్తోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మాయి ఒకట్రెండు సంవత్సరాలు పెద్ద అయి ఉంటుంది. కానీ.. అమ్మాయి వయసు 21 ఉండి.. అబ్బాయి వయసు 15 ఏళ్లు మాత్ర ఉంటే..? సరిగ్గా ఇక్కడ ఓ ప్రేమజంట ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది.

    Also Read: పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే..: కేసీఆర్‌‌ డిమాండ్‌

    తమ ప్రేమకు వయసు అడ్డంకి అనుకొని భ్రమపడి ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది ఈ ఘోరం. జిల్లాలోని గార్ల మండలానికి చెందిన ప్రశాంత్ పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ఇద్దరికీ కొన్నాళ్ల కిందట పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వయసులో వ్యత్యాసం ఉండడంతో వీళ్లు తమ ప్రేమ విషయాన్ని మూడో వ్యక్తికి చెప్పలేదు.

    అలా అలా కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే.. ఇలాంటి విషయాలు కూడా ఎన్నో రోజులు దాగవు కదా. సోమవారం ఇరు కుటుంబాలకూ తెలిసింది. దీంతో ఈ ప్రేమ జంట అదే రోజు తమ ఇళ్ల నుంచి పారిపోయింది. వీరిద్దరి కోసం వెతుకుతున్న క్రమంలో ఊరు శివార్లలోని వ్యవసాయ బావిలో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి.

    Also Read: జగన్‌.. మరో చారిత్రక నిర్ణయం

    వయసు తేడా వల్ల తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమో అనే భయంతోనే వీళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకొని ఉంటారని, పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ నిజంగా గుడ్డిదనే చెప్పాలి. వయసుతో సంబంధం లేకుండా..అదీ మైనర్‌‌లోనే ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. చివరకు తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్