తమిళనాడులో పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయ క్రీడ జల్లికట్టుకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రత్యేక మార్గదర్శకాలు పాటిస్తూ జల్లికట్టును నిర్వహించుకోవచ్చని తెలిపింది. కాగా ఈ కార్యక్రమంలో 300 మంది పోటీదారులు మాత్రమే పాల్గొనాలని, పోటీలకు ముందు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. అటు ప్రేక్షకులను 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని నిర్వాహకులకు సూచించింది. అయితే కరోనా నేపథ్యంలో జల్లికట్టు నిర్వహణకు అనుమతినివ్వడంతో పాటు మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించింది. గతంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న ఈ క్రీడపై సుప్రీం కోర్టు నిషేధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో రాష్ట్రప్రభుత్వం చట్టసవరణ ద్వారా నిషేధాన్ని తొలగించింది. దీంతో ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినానికి ఈ క్రీడను నిర్వహిస్తారు.