Ponguleti Srinivasa Reddy: పొంగులేటి మీద ముప్పేట దాడికి భారత రాష్ట్ర సమితి ప్లాన్: ఎన్టీఆర్ జయంతి నుంచే షురూ..

ఇక నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మం బైపాస్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా నిన్నంతా కలియతిరి గారు.

Written By: Bhaskar, Updated On : May 29, 2023 5:53 pm

Ponguleti Srinivasa Reddy

Follow us on

Ponguleti Srinivasa Reddy: ఎన్నికలకు మరో ఐదు నెలలు సమయం ఉంది. తెలంగాణలో మిగతా జిల్లాల సంగతి ఏమో కానీ.. ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయాలు మంచి వేడి మీద సాగుతున్నాయి. మొన్నటిదాకా కాంగ్రెస్ వర్సెస్ భారత రాష్ట్ర సమితి లాగా మారిపోయిన అక్కడ జిల్లా రాజకీయాలు.. ఇప్పుడు కొత్త రూపు దాల్చుకున్నాయి. భారత రాష్ట్ర సమితి వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాగా రూపాంతరం చెందాయి. భారత రాష్ట్ర సమితి నాయకులు శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి పెంచారు. అయితే దీనికి పొంగులేటి కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇదే సమయంలో మీరు ఇంత దోచుకున్నారని పొంగులేటి అంటే, నువ్వు అక్కడ భూములు కబ్జా చేసావని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. ఈ జిల్లాలో ప్రతిపక్షం బలంగా లేదు కాబట్టి ఈ కామెంట్లకు గట్టి కౌంటర్ ఇవ్వలేకపోతోంది.

ఇక నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఖమ్మం బైపాస్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా నిన్నంతా కలియతిరి గారు. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గం లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలుచోట్ల విలేకరుల సమావేశం నిర్వహించి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ మనసు క్షోభకు గురవుతుందన్నారు. రాజకీయాలు ఇంతటి పతనావస్థకు చేరుకున్న విధానాన్ని చూసి ఆయన గుండె తల్లడిల్లుతుందన్నారు.. అంతేకాదు ఎన్టీఆర్ చలవతో రాజకీయాల్లోకి వచ్చిన వారు ఆయనకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. ఇక పొంగులేటి పర్యటన పూర్తి కాగానే భారత రాష్ట్ర సమితి నాయకులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు.

ఎన్టీఆర్ విగ్రహానికి పాలతో అభిషేకం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు జీర్ణించుకోలేకపోయారు. పొంగులేటి వేసిన పూలమాలలు మొత్తం తొలగించి ఎన్టీఆర్ విగ్రహం మైల పడిపోయిందని పాలతో అభిషేకం చేశారు. శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించడం సరికాదని కామెంట్లు చేశారు. అంతేకాదు పొంగులేటి అనుచరుడు కార్తీక్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడి చేశారు. పోలీసుల ఎదుట అతడిని చితకబాదారు. అంతకుముందు రాత్రి అంటే శనివారం రోజు మధిరలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయం పై భారత రాష్ట్ర శాంతి నాయకులు దాడి చేశారు. ఆ కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. పూల కుండీలను పగలగొట్టారు. అర్ధరాత్రి పూట ఈ సంఘటన చోటు చేసుకుంది.. మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకుల వీరంగంతో ఆ ప్రాంతం మొత్తం భారీ శబ్దాలు వచ్చాయి. ఆ సమీప ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

పొంగులేటి నివాళులు అర్పించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు

అయితే ఈ వరుస పరిణామాలు పొంగులేటి ని భారత రాష్ట్ర సమితి కార్నర్ చేసినట్టు సూచిస్తున్నాయి. పొంగులేటి అనుచరులను అరెస్ట్ చేయడం, వారి మీద కేసులు పెట్టడం, పొంగులేటి మీటింగ్కు వెళ్లకుండా జర్నలిస్టులను నిలువరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అంతేకాదు పొంగు లేటి వెంట తిరుగుతున్న వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నామనేది పొంగులేటి స్పష్టం చేయకపోవడంతో కేడర్ కూడా డైలమాలో పడింది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ ప్రస్తుతానికైతే పొంగులేటిని ఖమ్మం భారత రాష్ట్ర సమితి కార్నర్ చేసింది. అయితే దీని వెనుక ఒక మంత్రి చక్రం తిప్పుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా బొంగులేటి వర్గీయులపై ఉక్కు పాదం మోపుతున్నట్టు తెలుస్తోంది.