Bharat Bandh: దేశవ్యాప్త సమ్మెకు అన్ని సంఘాలు ముందుకొచ్చాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు రెండు రోజులు అన్ని సేవలను స్తంభింపజేసి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా మార్చి 28, 29 తేదీల్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీనికి అన్ని సంఘాలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా జరిగే సమ్మె కావడంతో దీని ప్రభావం అన్నింటిపై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. రెండు రోజులు వ్యవస్థలు స్తంభిస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. అయినా కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే దీనికి కారణమని చెబుతున్నారు.

కేంద్రం ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటీకరించేందుకు కొన్నింటిని విక్రయించేందుకు చేస్తున్న కుట్రలను అడ్డుకునే క్రమంలోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించాయి. సమ్మెతో దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు సమ్మెకు సిద్ధమని తెలిపాయి. సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాలు నిలిచినట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంకు మినహా అన్ని బ్యాంకులు సమ్మెలో పాల్గొంటున్నాయి. రెండు రోజుల నిరసనతో కేంద్రం దిగిరావాలని ఆశిస్తున్నాయి.
Also Read: KGF Chapter 2 Trailer Talk:`కేజీఎఫ్ 2` ట్రైలర్ టాక్ : అద్భుత విజువల్ యాక్షన్ వండర్ !
లాభాల బాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నందున కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెతో నిత్యావసర సేవలు రవాణా, విద్యుత్, రైల్వే, బ్యాంకింగ్ తదితర సేవలకు విఘాతం కలగనుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలతో కుదేలైపోతున్న వ్యవస్థలను నిర్వీర్యం చేసే ఉద్దేశాలను అడ్డుకోవాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.
దాదాపు 20 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు తాము సమ్మెల్లో పాల్గొన్నట్లు ప్రకటించడంతో అత్యవసర సేవలకు ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. అయినా వారు లెక్కచేయడం లేదు. కేంద్రం దిగి వచ్చి ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నాయి. కానీ కేంద్రం కూడా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా మారతాయో తెలియడం లేదు.
కేంద్రం ప్రభుత్వ ఆస్తులను అమ్మాలనే ఆలోచన విరమిస్తుందా? కార్మిక సంఘాలు చేపడుతున్న సమ్మెకు దిగి వస్తుందా? లేక ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోందా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. ఏదిఏమైనా కేంద్రం నిర్ణయాలపై ప్రజల భవిష్యత్ కూడా ఆధారపడి ఉందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
Also Read: Congress Seniors: అయ్యయ్యో.. కాంగ్రెస్ సీనియర్ల పరువు మొత్తం పోయే..!