Petrol, Diesel Prices Hiked Again: దేశంలో పెట్రోధరలు పెరుగుతున్నాయి. రోజురోజుకు ధరల పెరుగుదల ప్రజలను మరింత బాధిస్తున్నాయి. గత వారం రోజుల్లో ఆరుసార్లు ధరలు పెంచడంతో కంగారు పడుతున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక ధరలు పెంచడం కొనసాగుతోంది. సోమవారం కూడా ధరల పెరుగుదలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో అసలు ఏం జరుగుతోంది. ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయినా దీనికి సమాధానం మాత్రం కనిపించడం లేదు.

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రో భారం ఎందుకు పెరుగుతోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అని చెప్పినా అక్కడి నుంచి మనకు తక్కువ ధరకే పెట్రో ఉత్పత్తులు దొరుకుతున్న ధరాభారం మాత్రం ఎందుకు అదుపులోకి రావడం లేదు. భారత్ లో మాత్రం ధరల పెరుగుదల ఆగడం లేదు. చమురు ధరలు ఇంతగా పెరగడం చూస్తుంటే దీని ప్రభావం ఎందాకా వెళ్తుందో తెలియడం లేదు.
Also Read: Pawan Kalyan: కాపుల ఐక్యత కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి
కేంద్రం మాత్రం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతోనే పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని మంత్రులు సైతం చెబుతున్నారు. దీంతో సామాన్యుడికి మాత్రం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలో భారత్ కు మాత్రం పెట్రో ధరల మంట కాలుతూనే ఉంది. పెట్రోల్ పై రూ.30 పైసలు, డీజిల్ పై రూ.35 పైసల చొప్పున ధరలు పెరగడంతో ప్రజల్లో అసహనం కలుగుతోంది.
వారం రోజుల్లో ఇప్పటి వరకు రూ. దాదాపు రూ. 4.10 ల మేర ధర పెరగడం తెలిసిందే. మునుముందు ఇంకా ధరలు పెరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. పరిస్థితి ఇలా అయితే ఎలా అనే భయం అందరిని వెంటాడుతోంది. విపరీతంగా పెరుగుతుంటే దీనికి అడ్డుకట్ట ఎక్కడ అనే సందేహాలు వస్తున్నాయి. సామాన్యుడి జీవితంలో ప్రధాన భాగస్వామి అయిన వాహనాల విషయంలో పెట్రో ధరల పెరుగుదల పెను ప్రభావం చూపుతోంది. దీనికి అంతం ఎక్కడో తెలియడం లేదు.
Also Read: Rajamouli-Mahesh Babu: రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ లీక్ !