KTR USA tour Successful: చాలా రోజుల తర్వాత కేటీఆర్ పెట్టుబడులను ఆకర్సించేందుకు అమెరికా టూర్ వేశారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సాగిన ఆయన టూర్ కొంత మేర సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే అది ఊహించిన మేర మాత్రం కాదు. ఎందుకంటే కేటీఆర్ ఈ టూర్ లో బడా కంపెనీల అధినేతలతో భేటీ అయ్యారు.
సీఎం తర్వాత సీఎం అంతటి వాడు కాబట్టి.. కేటీఆర్ ప్రతిపాదనలకు అమెరికా బిజినెస్ పర్సన్లు కూడా రావడానికి ఒప్పుకున్నారు. వారం రోజులుగా సాగిన ఆయన టూర్‌లో ఎక్కడా కూడా రాత పూర్వక ఒప్పందాలు మాత్రం పెట్టుకోలేదు. కేవలం మాటల వరకే వస్తామంటూ చెప్పారు. తెలంగాణలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు వారంతా సుముఖంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.

ఇంకా కొందరేమో ఇప్పటికే హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉన్న తమ వ్యాపారాలను విస్తరిస్తామంటూ వివరించారు. అంత వరకే కేటీఆర్ టూర్ జరిగింది. కానీ వారి మాటలను కార్యరూపం దాల్చేలా చొరవ తీసుకోవాల్సి ఉంది. వారు చెప్పిన వాటిని ఫాలోఅప్ చేసుకుంటే.. కచ్చితంగా సంతోషింగ దగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి.
అదే గనక జరిగితే హైదరాబాద్ మరింత డెవలప్ కావడం ఖాయం. ఎందుకంటే కేటీఆర్ భేటీ అయింది అగ్రశ్రేణి కంపెనీలతోనే. వాటిల్లో ఏ కొన్ని తమ బ్రాంచులను ఇక్కడ పెట్టినా.. కేటీఆర్ సక్సెస్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఇక మన ఊరు-మన బడి కార్యక్రమానికి తెలంగాణ ఎన్నారైల నుంచి విరాళాలు సేకరించి స్కూళ్లను డెవలప్ చేయాలని భావిస్తున్నారు కేటీఆర్. కాగా ఈ విషయంలో మాత్రం చాలామంది ఎన్నారైలు బాగానే స్పందించారు.
Also Read: Amit Shah Operation Telangana: ఆపరేషన్ తెలంగాణ షురూ చేసిన అమిత్ షా.. ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలు..
కాబట్టి వీలైన మేర విరాళాలు రావడం ఖాయమే. కానీ పెట్టుబడుల విషయంలోనే ఇంకాస్త గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది. మరి కేటీఆర్ అనుకున్న లక్ష్యాన్ని చేరువయ్యే క్రమంలో సక్సెస్ అయితే.. అది టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మైలేజ్‌ను తీసుకు వస్తుంది. ఇప్పటికే కేటీఆర్‌ను హైదరాబాద్ అభివృద్ధి ప్రధాతగా చెబుతున్న టీఆర్ ఎస్.. పెట్టుబడులు వస్తే గనక.. దాన్ని మరింత ప్రచారం చేసుకోవడానికి ఓ పెద్ద ఛాన్స్ దొరుకుతుంది.
త్వరలోనే ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి.. దీన్ని టీఆర్ ఎస్ నేతలు విరివిగా వాడుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ప్లాప్ అయితే మాత్రం.. బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్టే అవుతుంది. ఐటీ దాడుల నుంచి తప్పించుకునేందుకు అమెరికా వెళ్లారని ఇప్పటికే బీజేపీ పని గట్టుకుని మరి చెబుతుంది. కాబట్టి ఆ ఆరోపణలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం మరింత చురుగ్గా పని చేయక తప్పదు.
Also Read: AP Three Capitals: మూడు రాజధానుల కోసం జగన్ కు ఎందుకంత వెంపర్లాట?