BBC : ఇంగ్లాండ్ కేంద్రంగా ప్రసారాలు సాగించే ఈ ఛానల్ ప్రారంభం నుంచి భారత్ పై విషం కక్కుతూనే ఉంది. ఇప్పటికీ కక్కుతూనే ఉంటుంది. భారత్ అంటే విద్వేషాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఆ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీపై బిబిసి వివాదాస్పదమైన డాక్యుమెంటరీ రూపొందించింది. అందులో భారత ప్రధానిపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి.. బిబిసి కి నోటీసులు జారీ చేసింది. దీంతో బిబిసి ఆ వీడియోను వెనక్కి తీసుకుంది. టెలికాస్ట్ చేయకుండా ఆపింది. ఇక ఆదాయానికి సంబంధించి చెల్లిస్తున్న పన్నుల విషయంలో బిబిసి అవలంబిస్తున్న వైఖరి కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు. బీబీసీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపడంతో.. క్షమాపణ చెప్పిన బీబీసీ.. ఆర్థిక అవకతవకలకు పాల్పడింది నిజమేనని ఒప్పుకుంది. పైగా కేంద్ర దర్యాప్తు సంస్థ విధించిన అపరాధ రుసుమును చెల్లించింది.. ఆ తర్వాత బిబిసి విభిన్నమైన విధానాలలో భారత్ పై విష ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఒక రకంగా నెగిటివ్ వార్తలకు షుగర్ కోటెడ్ జర్నలిజాన్ని అద్ది.. ప్రచారం చేయడం ప్రారంభించింది.. కరోనా సమయంలోనూ అడ్డగోలుగా బీబీసీ కథనాలను ప్రసారం చేసింది. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి ప్రపంచం ముందు భారత్ పరువు తీయాలని చూసింది.
Also Read : సాగర దిగ్బంధం.. దాయాది వెన్నులో వణుకు!
ఇప్పుడు మళ్లీ విషం
బిబిసి పహల్గాం ఘటన కవరేజ్ విషయంలోనూ పక్షపాతం చూపించింది. భారత్ నిఘా వ్యవస్థ లోపం ఉందని ఎటువంటి ఆధారాలు లేకుండానే వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు భారత్ అకారణంగా పాకిస్తాన్ దేశానికి చెందిన వారి వీసాలను తిరస్కరించిందని.. ఒక రకంగా పాకిస్తాన్ దేశంపై వాణిజ్య యుద్ధం ప్రకటించిందని నిరాధారమైన కథనాన్ని ప్రసారం చేసింది. ఇది కేంద్రం దృష్టికి వెళ్లడంతో.. కేంద్రం తీవ్రంగా పరిగణించింది. వెంటనే బీబీసీ హెడ్ కు లేఖ రాసింది. ఇకపై బీబీసీ ప్రసారం చేసే కథనాలను.. ఇంతకుముందు ప్రసారం చేసిన కథనాలను పరిశీలిస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తుల వీసాలు రద్దుచేయకముందే..వీసాలు రద్దు చేసినట్టు బిబిసి వార్త సంస్థ కథనాన్ని ప్రసారం చేయడానికి కొంతమంది యూజర్లు తప్పు పట్టారు. సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి వారు తీసుకెళ్లారు. దీంతో తీవ్రంగా పరిగణించిన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. బిబిసికి లేఖ రాసింది. ” నిరాధారమైన వార్త కథనాలను ప్రసారం చేయడం పాత్రికేయం అనిపించుకోదు. వీసాలు రద్దు చేయకుండానే రద్దుచేయమని చెప్పడం నేలబారు పాత్రికేయానికి నిదర్శనం. ఇలాంటి చవక బారు కథనాల ద్వారా ఎలాంటి సందేశం ఇస్తుందో బీబీసీకే తెలియాలంటూ” నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
Also Read : పాకిస్థాన్ నుంచి తిరిగి వస్తున్న భారతీయులు.. ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారంటే..