Tollywood Star Hero : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఇతను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడి అవకాశాలు అందుకొని హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో హీరోగా దూసుకుపోతూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ స్టార్ హీరో హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసి అలరిస్తున్నాడు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు తమ స్వయంకృషితో పైకి ఎదిగిన వాళ్లే. ఇటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్స్ గా ఎదిగిన వాళ్లలో ఈ స్టార్ హీరో కూడా ఒకరు. తన కెరియర్ ప్రారంభంలో ఇతను విలన్ గా సినిమాలలో నటించి ఆ తర్వాత హీరోగా మారాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా రానిస్తున్నాడు. తనకంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో సినిమా థియేటర్లలో వస్తుంది అంటే చాలు ఆయన అభిమానులకు పూనకాలే.
Also Read :సినిమాలలో ఎంట్రీ.. కానీ ప్రస్తుతం బుల్లితెరపై సెటిల్ అయిన ఈ అందాల యాంకరమ్మ ఎవరో తెలుసా…
ఈ స్టార్ హీరో చాలామంది యంగ్ దర్శకులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అని చెప్పొచ్చు. కానీ ఈ స్టార్ హీరోకి మాత్రం క్లాస్ మాస్ అని తేడా ఉండదు. ఈయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు అందరూ అభిమానిస్తారు. ఈ స్టార్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో రవితేజ. కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజ ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. అలాగే పలు సినిమాలలో విలన్ గా కూడా చేశారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో రవితేజ చిన్న విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
అలాగే రవితేజ ఎన్నో సినిమాలలో సహాయక పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయ్యాడు. సింధూరం సినిమాతో రవితేజ హీరోగా మారాడు. సింధూరం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ హీరోగా తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రవితేజ తెలుగులో ఖడ్గం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, భద్ర, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, నా ఆటోగ్రాఫ్, వెంకీ, విక్రమార్కుడు, దుబాయ్ శ్రీను, కిక్, మిరపకాయ్, వాల్తేరు వీరయ్య, ధమాకా ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. త్వరలో రవితేజ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నారు.
View this post on Instagram