Bandi Sanjay Prajasangrama Yatra: వర్షమొచ్చినా లెక్కచేయకుండా సాగిన బండి పాదయాత్ర

7వ రోజు పాదయాత్రకు పోటెత్తిన జనం * పలువురు మాజీమంత్రులు, సీనియర్ల సంఘీభావం * రేపు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాక Bandi Sanjay Prajasangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 7వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర చిట్టెంపల్లి నుండి ప్రారంభమై మన్నెగూడ చౌరస్తా మీదుగా వికారాబాద్ సమీపంలోని శ్రీ సాయి డెంటల్ కాలేజీ వరకు కొనసాగింది. దారిపొడవునా జనం పోటెత్తారు. సంజయ్ తో పోటోలు దిగేందుకు […]

Written By: NARESH, Updated On : September 3, 2021 10:24 pm
Follow us on

  • 7వ రోజు పాదయాత్రకు పోటెత్తిన జనం
    * పలువురు మాజీమంత్రులు, సీనియర్ల సంఘీభావం
    * రేపు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాక

Bandi Sanjay Prajasangrama Yatra: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 7వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర చిట్టెంపల్లి నుండి ప్రారంభమై మన్నెగూడ చౌరస్తా మీదుగా వికారాబాద్ సమీపంలోని శ్రీ సాయి డెంటల్ కాలేజీ వరకు కొనసాగింది. దారిపొడవునా జనం పోటెత్తారు. సంజయ్ తో పోటోలు దిగేందుకు యువత, మహిళ, పిల్లలు పోటీలు పడ్డారు. కార్యకర్తల నినాదాలు, యువకుల ఉత్సాహంతో ప్రజా సంగ్రామ యాత్ర వికారాబాద్ సమీపంలోని డెంటల్ కాలేజీ వరకు కొనసాగింది. శనివారం వికారాబాద్ పట్టణంలో బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణంలో నిర్వహించే బహిరంగ సభకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరై ప్రసంగించనున్నారు.

ఈ రోజు (శుక్రవారం) జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ తోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ మంత్రులు చంద్రశేఖర్, సుద్దాల దేవయ్య, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ పాదయాత్రలో పాల్గొన్నారు. వీరితోపాటు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మహిళా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి, ఆలె భాస్కర్, కొప్పు భాష, హుస్సేన్ నాయక్, భాను ప్రకాశ్, శ్రీధర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా ఇంఛార్జీ కాసాని వెంకటేశ్వర్లు తదితరులు బండి సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ వికారాబాద్ వరకు నడిచారు.

పాదయాత్రలో కండ్లపల్లి గ్రామానికి చెందిన గొర్ల కాపరులు నాంచారోళ్ల దుర్గయ్య, కావలి వెంకటయ్యలను పలకరించిన బండి సంజయ్ కుమార్. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని వాకబు చేశారు. గొర్ల కాపరుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. ‘‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, అసలు గొర్లకాపరుల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు.. గొర్రెల స్కీం ఇంతవరకు వర్తింపుకాలేదు’’అని దుర్గయ్య, వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ప్రజలకు తెలిపేందుకే, కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నానని చెప్పిన బండి సంజయ్ కుమార్ మీకు అండగా బీజేపీ ఉంటుందని పేర్కొంటూ ముందుకు కదిలారు.
దారిలో పూడూరు మండలం శేరిగూడ గ్రామస్థులు బండి సంజయ్ ను కలిశారు. ‘‘మా గ్రామంలో రోడ్డు లేదు. డ్రైనేజీ, సీసీ రోడ్లు లేవు. కనీస సౌకర్యాల్లేవు. అధికారులకు, ఎమ్మెల్యేకు, టీఆర్ఎస్ నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టకున్నా ఫలితం లేదు’’అని వాపోయారు. ఈ గ్రామానికి కేంద్రం నిధులిచ్చినా అభివ్రుద్దికి మాత్రం నోచుకోలేదని గ్రామస్థుల చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకున్న బండి సంజయ్ గ్రామ సమస్యల పరిష్కారానికి క్రుషి చేస్తానని క్రుషి చేస్తానని చెప్పారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నాయకుడు మహిపాల్ యాదవ్ ఆధ్వర్యంల్ పలువురు విద్యార్థులు బండి సంజయ్ ను కలిసి సంఘీభావం తెలిపారు. మిర్జాపూర్ గేట్ వాసులు సయ్యద్ జిలానీ, శ్రీనివాస్ గౌడ్, మల్లయ్య, అశోక్ గౌడ్, వెంకటయ్య తదితరులు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ కుమార్ ను కలిసి సంఘీభావం తెలిపారు. పేదల కోసం నిరంతరం కృషిచేస్తున్న బీజేపీకే వచ్చే ఎన్నికల్లో ఓటువేస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావట్లేదని వాపోయారు. బండి సంజయ్ పాదయాత్ర కు నేను సైతం అంటూ గత వారం రోజులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు సైకిల్ యాత్ర చేస్తున్నాడు.

అంతకుముందు ఉదయం రంగారెడ్డి జిల్లా నేతలతో బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, తూళ్ల వీరేందర్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేసిన రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలను బండి సంజయ్ అభినందించారు. రంగారెడ్డి జిల్లా తరపున పార్టీ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా స్పూర్తితో వికారాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్రలను మరింత దిగ్విజయవంతమవుతుందనే భావనను వ్యక్తం చేశారు. పాదయాత్రలో అనేక ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఆయా సమస్యలపై ఉద్యమించాలని జిల్లా నేతలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ఉన్న ఆవేశాన్ని, ఆలోచనను చల్లారనీయొద్దని, 2023 వరకు కొనసాగించాలని కోరారు.

-చిన్నారుల సంఘీభావం
రంగారెడ్డి జిల్లా బీజేవైఎం అధ్యక్షురాలు సాహూ శ్రీలత ఆధ్వర్యంలో చిన్నారుల బ్రందం బండి సంజయ్ ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఉద్యమం సహా వివిధ చారిత్రక సంఘటనల్లో బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ప్లకార్డులను చిన్నారులు ప్రదర్శించారు. జై నరేంద్ర మోదీ, జై బీజేపీ, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. బండి సంజయ్ పాదయాత్ర దిగ్విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చిన్నారుల పాటలు, పద్యాలను ఆలపించారు.