Bandi Sanjay: గత ఎంపీ ఎన్నికలు బండి సంజయ్ కు బాగా కలిసి వచ్చాయి. 2018లో తెలంగాణలో జరిగిన ముందుస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన బండి సంజయ్.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాస్త దూకుడు పెంచడంతో బీజేపీ పెద్దలు ఆయనకు బీజేపీ స్టేట్ చీఫ్ పదవిని కట్టబెట్టారు.

అప్పటి నుంచి ఆయన ప్రజల్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు అధికార పార్టీ విధానాలను ఎండగడుతూ వస్తున్నారు. మాటల తూటాలు పేలుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇలా దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మాట శైలితో ఓట్లను రాబట్టగలిగారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఆయనకు పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read: KTR vs Revanth Reddy: కేటీఆర్ ఎక్కడున్నారు? నిజంగానే దుబాయ్ కు వెళ్లారా?
హుజూరాబాద్ ఉపఎన్నిక కారణంగా తొలివిడత పాదయాత్రను నిలిపివేశారు. అనంతరం ఎన్నికల బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత పాదయాత్ర గురించి ఇప్పటి వరకు ప్రస్తావన రాలేదు. ప్రస్తుతం ఆయన రెండో విడత పాదయాత్రకు సంబంధించిన ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ హైకమాండ్ నుంచి ఆయనకు ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని టాక్. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతలు అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్, కేసీఆర్ అవినీతి వంటి విషయాలను ప్రస్తావించిన అమిత్ షా.. బండి సంజయ్ పాదయాత్ర గురించి మాత్రం ఎలాంటి మాట చెప్పలేదు.
పాదయాత్ర నిర్వహించేందుకు అనుమతి కోసం బండి సంజయ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు తాజాగా నిరుద్యోగ దీక్షను ప్లాన్ చేస్తున్నారు. కానీ ఒమిక్రాన్ విషయంలో ప్రధాని ఇచ్చిన సందేశంతో ఆ దీక్షలకు సైతం ప్రస్తుతం బ్రేక్ పడింది. హైకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. దీంతో బండి సంజయ్ కు షాక్ తగిలినట్టయింది. ఇలా బండి సంజయ్ చేపట్టిన రెండు కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కానీ, బండికి ఇలా అవాంతరాలు ఎదురవుతుండటం పట్ల మరో వర్గం వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు టాక్.