Homeజాతీయ వార్తలుElon Musk Tesla faces challenges in India: మస్క్ టెస్లా కు చుక్కలు.. ఇండియా...

Elon Musk Tesla faces challenges in India: మస్క్ టెస్లా కు చుక్కలు.. ఇండియా అంటే బిగినర్స్ కంట్రీ కాదురా బాబూ!

Elon Musk Tesla faces challenges in India: ఎలాన్ మస్క్ తయారు చేసిన టెస్లా కార్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వీటిని సైబర్ ట్రక్ లు అని కూడా పిలుస్తుంటారు. ఈ కార్లను అమెరికాలో తయారుచేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాడు మస్క్. టెస్లా కార్లలో అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. నావిగేషన్.. ఇంటర్నెట్.. డ్రైవర్ లెస్ డ్రైవింగ్.. ఎలక్ట్రానిక్ మెథడ్.. ఇలా సకల సౌకర్యాలు టెస్లా కార్లలో ఉంటాయి.

టెస్లా కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వీటిని కొనుగోలు చేయాలంటే శ్రీమంతుల వల్ల మాత్రమే అవుతుంది. మనదేశంలో టెస్లా కార్లు ఇప్పుడిప్పుడే రోడ్లమీద పరుగులు పెడుతున్నాయి. టెస్లా కార్లు అమెరికా రోడ్లమీద దూసుకుపోతాయి. నావిగేషన్.. ద్వారా ఈ కారు గమనాన్ని ఎప్పటికప్పుడు నిర్దేశించవచ్చు. కార్లో ఉన్న డిస్ప్లే అనలాగ్ ఎప్పటికప్పుడు రోడ్డుమీద ఉన్న వ్యక్తులను.. వెనుకనుంచి వచ్చే వాహనాలను.. చూపిస్తుంది. నావిగేషన్ ద్వారా వీటిని చూసుకుంటూనే డ్రైవింగ్ చేయవచ్చు.

టెస్లా కార్లు ప్రపంచ దేశాలలోని అన్ని రోడ్లమీద దూసుకుపోతుంటాయి. కానీ మనదేశంలో టెస్లా కార్లకు అంత సీన్ లేదని సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. టెస్లా కారు మనదేశంలో ఓ రోడ్డు మీద ప్రయాణిస్తుండగా.. నావిగేషన్ ద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను.. ఇతర వ్యక్తులను పరిశీలించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. అనుకోని అవాంతరాలు వచ్చాయి. దీంతో టెస్లా కారు అక్కడికక్కడే ఆగిపోయింది.

“టెక్నాలజీని ఉపయోగించి టెస్లా కారు ను నడపవచ్చని మస్క్ చెబుతుంటాడు. ప్రపంచ దేశాలలో దీనిని గొప్పగా ప్రచారం చేస్తూ ఉంటాడు. కానీ, ఇండియాలో అంత ఈజీ కాదు. భారతీయులు టెస్లా కారుకు చుక్కలు చూపించారు. పిచ్చెక్కించారు. నడిరోడ్డు మీద అక్కడికక్కడే ఆగిపోయేలా చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత మస్క్ అన్ని మూసుకుంటాడు. ప్రపంచ దేశాలలో తన కారు గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని ఆపేస్తాడు. ఎందుకంటే ఇండియా అనేది బిగినర్స్ కంట్రీ కాదు. ఇది అప్డేట్ కంట్రీ. ఎంతటి తోపు వ్యక్తులైనైనా సరే పడుకోబెడుతుంది. చివరికి మస్క్ ను కూడా పడుకోబెట్టిందని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు…

టెస్లా కారు అలా నడిరోడ్డు మీద ఆగిపోవడానికి ప్రధాన కారణం.. అప్పటికప్పుడు రోడ్డుకు అడ్డంగా వాహనాలు రావడం.. వ్యక్తులు రోడ్డు మీదుగా నడక సాగించడం.. అందువల్లే టెస్లా కారు ఆగిపోయింది. టెస్లా కారు ఒక్కసారి రోడ్డుమీకి వస్తే.. నావిగేషన్ ద్వారా రోడ్డు మీద ఉన్న దృశ్యాలను లోడ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు ఏవైనా వాహనాలు ఎదురైతే.. వ్యక్తులు ఎదురుగా వస్తే నావిగేషన్ వ్యవస్థ తర్జనభజన పడుతుంది. అప్పుడు టెస్లా కారు ఆగిపోతుంది. ఇండియన్ రోడ్లమీద జరిగింది కూడా ఇదేనని నెటిజన్లు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Oktelugu Epaper