Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరో విజయ్ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా.. కష్టపడి స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఆ తర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు.

కాగా, మరోవైపు ఎప్పటి కప్పుడు సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే సోషల్‌మీడియాలో మంచి ఫాలోవర్స్‌ను దక్కించుకున్నారు విజయ్.కాగా, ఇప్పుడు విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను దక్కించుకున్నారు. ఫ్యాషన్ ఐకాన్‌గా విజయ్ మీడియా ప్రపంచంలో తనకంటూ స్పెషల్ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం విజయ్ పాన్ఇండియా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న లైగర్‌లో హీరోగా కనిపించనున్నారు విజయ్. ఇందులో అనన్య పాండే హీరోయిన్గా కనిపించనుంది. కాగా, ఈ సినిమాకు పూరి, ఛార్మీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మాాణం వహిస్తున్నారు. కాగా,వచ్చే ఏడాది ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా కనిపించనున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నాడు విజయ్.