Huzurabad and Badvel: రెండు తెలుగు స్టేట్లలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. నామినేషన్ల ఉపసంహరణలకు నేడు ఆఖరి రోజు కావడంతో బరిలో నిలిచిన అభ్యర్థులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. బద్వేల్ లో 15, హుజురాబాద్ లో 37 మంది బరిలో నిలిచారు. దీంతో ఎన్నిక అక్టోబర్ 30న జరగనుంది. బద్వేల్ ఉప ఎన్నిక బరిలో 15 మంది నిలిచినా ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే నెలకొంటుందని తెలుస్తోంది. ఇక్కడ 15 మంది అభ్యర్థితో పాటు నోటా కు కూడా స్థానం ఉంటుంది. దీంతో ఈవీఎంలలో 16 గుర్తులు ఉండనున్నాయి.

ఇక హుజురాబాద్ లో 37 మంది రంగంలో నిలిచారు. కానీ పోటీ మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మద్యే ఉంటుందనేది తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నా అభ్యర్థి బలమైన నేత కాకపోవడంతో ఆయన ప్రభావం తక్కువేనని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ప్రధాన దృష్టి కేంద్రీకరించడం లేదని సమాచారం. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తన పట్టు సాధించాలనే తపనతో ఉన్నట్లు కనిపించడం లేదు. ఫలితంగా ఓటు బ్యాంకు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.
హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. అనారోగ్య కారణాలతో పాదయాత్ర వాయిదా వేసినా తనదే గెలుపు అనే ధీమాలో ఉన్నారు. మొత్తం 42 మందిలో ఐదుగురు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 37 మంది పోటీలో నిలిచారు. దీంతో ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న హుజురాబాద్ లో ఎవరు పైచేయి సాధిస్తారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
Also Read: KTR: కేసీఆర్ తప్పుకొని కేటీఆర్ కు బాధ్యతలు.. 25న ముహూర్తం?
ఇక ఏపీలోని బద్వేల్ లో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో వైసీపీ ఆయన భార్య సుధను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో జనసేన పోటీ నుంచి విరమించుకోవడంతో టీడీపీ కూడా తప్పుకుంది. దీంతో ఇక్కడ వైసీపీదే విజయం అని తేలిపోయినా పోటీలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ నిలిచాయి. కానీ విజయం ఏకపక్షమే అని అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. మొత్తానికి హుజురాబాద్ లో పోటీలో ఎవరి విజయం సాధిస్తారోనని అందరు ఎదురు చూస్తున్నారు.
Also Read: Telangana: తెలంగాణ భవితను ‘బంగారం’ చేస్తున్నారట..?