ICC T20 World cup: ప్రపంచకప్ టీ20 సమరానికి టైం దగ్గరపడుతున్న వేళ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీంను మార్చేందుకు ఆఖరి రోజు వేళ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకరిని పక్కకు తప్పించి మరొకరిని తీసుకుంది.

అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ దుబాయ్ లో మొదలు కానుంది. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. అయితే నేటి వరకు మార్పులకు అవకాశం ఉండడంతో బీసీసీఐ ఒక సంచలన మార్పు చేసింది.
ఇప్పటివరకు ప్రధాన జట్టులో భాగమైన అక్షర్ పటేల్ ను స్టాండ్ బైలోకి చ్చేరింది. అలాగే స్టాండ్ బైగా ఉన్న శార్దుల్ ఠాకూర్ ను తీసుకొచ్చి ప్రధాన జట్టుతో కలిపింది.
ఇక ఐపీఎల్ లోనే అందరికంటే ఫుల్ ఫామ్ లో ఉన్న శిఖర్ ధావన్ ను కూడా బీసీసీఐ టీంలోకి తీసుకోకుండా షాకిచ్చింది. అలాగే యజ్వేంద్ర చాహల్ ను కూడా తప్పించింది.
విరాట్ కెప్టెన్ గా.. ధోని మెంటర్ గా ఉన్న భారత జట్టులో శార్దుల్ ఠాకూర్ ను చేర్చుతూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. టీం మేనేజ్ మెంట్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. 15 మంది సభ్యుల బృందంలో భాగమైన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పుడు స్టాండ్ బైలోకి పోగా.. స్టాండ్ బైగా ఉన్న శార్ధుల్ ప్రధాన జట్టులోకి వచ్చాడు.
* ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టు ఫైనల్ ఇదే..
కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్రజడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ
-స్టాండ్ బై : శ్రేయాస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్.
🚨 NEWS 🚨: Shardul Thakur replaces Axar Patel in #TeamIndia's World Cup squad. #T20WorldCup
More Details 🔽
— BCCI (@BCCI) October 13, 2021