RGV konda movie:తాను పక్కా నాస్తికుడిని అని బహిరంగంగా చెప్పుకొన్న దర్శకుడు ఆయన.. దేవుళ్లంటే నమ్మకం లేదని తెగేసి చెప్పాడు. దేవుళ్లపై ప్రేమ లేదన్నాడు. దెయ్యాలంటే లవ్ అన్నాడు. వాటితోనే కలిసి సినిమా తీశాడు. తీస్తున్నాడు కూడా. అయితే తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు అమ్మవారిని దర్శించుకున్నాడు. విస్కీతో తల్లికి నైవేద్యం పట్టాడు.అదే ఇప్పుడు హిందూవాదుల ఆగ్రహానికి కారణమవుతోంది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ తాజాగా తెలంగాణ రక్తచరిత్రను తీయడానికి రెడీ అయ్యారు. తెలంగాణలో రెబల్ ఫైర్ బ్రాండ్స్ అయిన కొండా మురళి-సురేఖల జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నారు. ‘కొండా’పేరుతో మొదలుపెట్టిన ఈ మూవీ షూటింగ్ ను తాజాగా వరంగల్ లో మొదలుపెట్టారు.
షూటింగ్ కోసం వచ్చిన కొండా మురళిని కొండా సురేఖ ఏకంగా హారతి ఇచ్చి స్వాగతం పలికడం విశేషం. అనంతరం కొండా ఇంట్లో కాసేపు గడిపిన వర్మ ర్యాలీ తీశారు. కొండా దంపతులతో కలిసి వ్యాన్ పై అభిమానులను అలరించాడు.
వరంగల్ లోని వంచనగిరి సమీపంలో చిత్ర నిర్మాణం ప్రారంభించాడు వర్మ. వంచనగిరిలోని గండి మైసమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. విస్కీ మద్యాన్ని అమ్మవారికి వర్మ నైవేద్యంగా సమర్పించి అందరికీ షాకిచ్చాడు. మద్యం అంటే ఇష్టపడే వర్మ ఇలా చేయడం చూసి జనాలంతా షాక్ అయ్యారు. దీనిపై ట్వీట్ కూడా చేశాడు. *నేను ఓడ్కా తాగుతాను.. కానీ మైసమ్మ దేవత విస్కీ తాగుతోంది’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. ఇలా తన వెటకారాన్ని దేవుళ్లపై కూడా వర్మ రుద్దేశాడు.
వీడియో ఇదే..
Though I only drink Vodka, I made the Goddess Maisamma drink Whisky 😃 pic.twitter.com/rcwHc2DSde
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021