https://oktelugu.com/

MLA Roja: బ్యాడ్ లక్.. జగన్ నిర్ణయం రోజాకు మైనస్ కానుందా?

MLA Roja: సినీ నటి రోజా టాలీవుడ్లో హీరోయిన్ గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరిస్తూ వెండితెర, బుల్లితెరపై తన మార్కును ఇప్పటికీ కూడా చూపిస్తోంది. సినీ కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆర్కే రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలినాళ్లలో టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా రోజా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కంచు కంఠంతో ప్రత్యర్థులను హడలెత్తించేవారు. టీడీపీలో ఆమెకు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2022 / 01:10 PM IST
    Follow us on

    MLA Roja: సినీ నటి రోజా టాలీవుడ్లో హీరోయిన్ గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టీవీ షోల్లో జడ్జీగా వ్యవహరిస్తూ వెండితెర, బుల్లితెరపై తన మార్కును ఇప్పటికీ కూడా చూపిస్తోంది. సినీ కెరీర్ పిక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆర్కే రోజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలినాళ్లలో టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధిగా రోజా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కంచు కంఠంతో ప్రత్యర్థులను హడలెత్తించేవారు.

    MLA Roja

    టీడీపీలో ఆమెకు పొమ్మనలేక పొగబెట్టడంతో ఆ తర్వాత ఆమె వైఎస్సాఆర్సీపీలో చేరింది. జగన్మోహన్ రెడ్డి మద్దతుతో నగరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు రోజా విజయం సాధించి సత్తా చాటింది. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాకు మంత్రి పదవీ దక్కుతుందనే ప్రచారం జరిగింది. తొలి క్యాబినెట్లోనే రోజాకు మంత్రి వస్తుందని అంతా భావించగా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో భాగంగా చివరి నిమిషంలో ఆమెను పక్కన పెట్టారు.

    ఆ తర్వాత రోజాకు ఏపీఐసీసీ ఛైర్మన్ గా నియామకం అయ్యారు. అయితే ఇటీవల జరిగిన నామినేషన్ పోస్టు భాగంగా రోజాను ఆ పదవీ నుంచి తప్పించారు. దీంతో రాబోయే మంత్రి వర్గంలో రోజాకు మంత్రి దక్కుతుందనే కామెంట్స్ విన్పించాయి. అయితే తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రోజాకు మైనస్ గా మారినట్లు కన్పిస్తుంది. ఈ ఉగాది నుంచి ఏపీలో కొత్తగా 26 జిల్లాలు అమల్లోకి రాబోతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

    జగన్మోహన్ రెడ్డి నూతన మంత్రి వర్గ విస్తరణ కూడా ఈ ఉగాదికే ముహూర్తం పెట్టుకున్నారని తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా కొత్తగా ఏర్పడే శ్రీ బాలాజీ జిల్లాలో చేర్చారు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం శ్రీబాలాజీ జిల్లాలోకి వచ్చి చేరింది. శ్రీబాలాజీ జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, చంద్రగిరి నియోజకవర్గాలున్నాయి. దీంతో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురులేకుండా పోయింది.

    ఇక చిత్తూరు జిల్లాలో చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు, కుప్పం నియోజకవర్గాలున్నాయి. ఈ జిల్లా నుంచి మంత్రిపెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు లేవు. ఈ జిల్లాలోనే నగరి నియోజకవర్గం కూడా ఉండటంతో రోజాకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి రోజాను బ్యాడ్ లక్ వెంటాడుతుందా? అన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.