Liquor Policy In Maharashtra: మహారాష్ర్టలో మద్యం విక్రయాలు జోరందుకోనున్నాయి. ఇకపై కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో వైన్ అందుబాటులో ఉండే విధంగా సర్కారు చర్యలు చేపట్టింది. దీంతో మద్యం అమ్మకాలు ఏరులై పారే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం మాత్రం తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో సవరించిన నిర్ణయానికే ఓటు వేయాలని చూస్తోంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు సపరేటు దుకాణాలు ఏర్పాటు చేసే మద్యం అమ్మకాలు ఇకపై కిరాణా దుకాణాల్లో లభ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది.

షెల్ఫ్ ఇన్ షాప్ విధానంలో వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో మద్యం అమ్మకాల్లో దూసుకుపోనుంది. కొత్త విధానంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుంది. ప్రజలకు మాత్రం ఇబ్బందులు ఏర్పడనున్నాయి. కిరాణా షాపుల్లో దొరికితే ఫుల్లుగా తాగి రోడ్డు మీదే పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
Also Read: జగన్ కు మరో రెండు షాక్ లు.. సమ్మెలోకి ఆర్టీసీ, వైద్యఉద్యోగులు
రైతుల కోసమే అని చెబుతున్న ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునే క్రమంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు లాభం చేకూరేలా ఈనిర్ణయం తీసుకున్నామని చెబుతోంది. రైతులు పండించే వాటితో వైన్ తయారు చేసి వారికి ప్రయోజనం చేకూర్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి నిర్ణయాలు తగదని సూచిస్తోంది. కానీ గోవా, హిమాచల్ ప్రదేశ్ లలో ఇలాంటి మద్యం విధానం అమలులో ఉందని అధికార పార్టీ చెబుతోంది. దీంతో రాష్ర్టంలో నూతన మద్యం పాలసీతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ సర్కారు మాత్రం లెక్క చేయడం లేదు. భవిష్యత్ లో ఏం జరగనుందో తెలియడం లేదు.
Also Read: ఉద్యోగుల సమ్మె: ప్రభుత్వానికి చెలగాటం.. ఉద్యోగులకు ప్రాణసంకటం
[…] […]