https://oktelugu.com/

Kousalya: బెడ్‌ పై నుంచి లేవలేని స్థితిలో స్టార్ సింగర్ !

Kousalya: ప్రముఖ సింగర్ కౌసల్యకు కరోనా సోకింది. 2రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తనకు లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయని సోషల్ మీడియాలో వెల్లడించింది. బెడ్‌పై నుంచి లేవలేకపోతున్నట్లు ఆమె తెలిపింది. మెడిసిన్ వాడుతున్నానని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ విషయం తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సినీ లోకమంతా కరోనా మయమే. ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో కరోనా కలకలం కొన సాగుతూనే ఉంది. మూడో వేవ్ కేసులు ఇండస్ట్రీలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 28, 2022 / 01:09 PM IST
    Follow us on

    Kousalya: ప్రముఖ సింగర్ కౌసల్యకు కరోనా సోకింది. 2రోజులుగా జ్వరంతో బాధపడుతున్న తనకు లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయని సోషల్ మీడియాలో వెల్లడించింది. బెడ్‌పై నుంచి లేవలేకపోతున్నట్లు ఆమె తెలిపింది. మెడిసిన్ వాడుతున్నానని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ విషయం తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు.

    Kousalya

    ఏది ఏమైనా ఇప్పుడు సినీ లోకమంతా కరోనా మయమే. ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో కరోనా కలకలం కొన సాగుతూనే ఉంది. మూడో వేవ్ కేసులు ఇండస్ట్రీలో చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ సారి కరోనా కేసులు ఇంత వేగంగా వ్యాప్తి చెందుతాయని ఎవ్వరూ ఊహించలేదు. సడెన్ గా కరోనా ఇలా ఇండస్ర్టీ పై అటాక్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

    Also Read: ఉద్యోగుల సమ్మె: ప్రభుత్వానికి చెలగాటం.. ఉద్యోగులకు ప్రాణసంకటం

    ఏది ఏమైనా సినిమా వాళ్లకు ఇలా వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో సినిమా వాళ్ళు మళ్ళీ ఆందోళన బాట పట్టారు. అసలు షూటింగ్ స్పాట్స్ లో కరోనా వస్తే.. ఆ స్పాట్ లో ఉన్న వంద మందికి పైగా కరోనా సోకే అవకాశం ఉంటుంది.

    Kousalya

    ప్రస్తుతం కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, నేడు శ్రీకాంత్ కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కాగా కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. త్రిష, సత్యరాజ్, థమన్ కోవిడ్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు.

    Also Read:  ప్రకాష్ రాజ్ మొదటి భార్య హీరో శ్రీహరికి ఏమవుతుందో తెలుసా?

    Tags