బాబు పోయాడు.. సీమకు ‘కరువు’ తీరింది మరీ! 

‘భూమికి పచ్చాని రంగేసి నట్లు’ అంటూ పాటలు పాడుకునే రాయలసీమ డెఫినెషన్‌ రానురాను మారిపోతోంది. అయితే ఫ్యాక్షన్ కాక‌పోతే క‌రువు అన్నట్టుగా రాయ‌ల‌సీమలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పి చాలా రోజులవుతోంది. రెండు దశాబ్దాలుగా అలాంటి ఆనవాళ్లే కనిపించడం లేదు. ఒకవేళ కొన్ని హత్యలు జరిగినా.. అవి రాజకీయ హత్యే తప్ప ఫ్యాక్షనిస్టు హత్యలు మాత్రం కావు.అలాంటి హ‌త్యల‌కు రాయ‌ల‌సీమ అయినా, కోన‌సీమ అయినా ఒక‌టే. అయితే.. అలాంటి రాయలసీమ అభివృద్ధిలో వెనుకబడిపోతోందనేది […]

Written By: NARESH, Updated On : October 6, 2020 4:13 pm

Did Chandrababu lose hope in that area ...?

Follow us on

‘భూమికి పచ్చాని రంగేసి నట్లు’ అంటూ పాటలు పాడుకునే రాయలసీమ డెఫినెషన్‌ రానురాను మారిపోతోంది. అయితే ఫ్యాక్షన్ కాక‌పోతే క‌రువు అన్నట్టుగా రాయ‌ల‌సీమలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పి చాలా రోజులవుతోంది. రెండు దశాబ్దాలుగా అలాంటి ఆనవాళ్లే కనిపించడం లేదు. ఒకవేళ కొన్ని హత్యలు జరిగినా.. అవి రాజకీయ హత్యే తప్ప ఫ్యాక్షనిస్టు హత్యలు మాత్రం కావు.అలాంటి హ‌త్యల‌కు రాయ‌ల‌సీమ అయినా, కోన‌సీమ అయినా ఒక‌టే. అయితే.. అలాంటి రాయలసీమ అభివృద్ధిలో వెనుకబడిపోతోందనేది పలువురి అభిప్రాయం.

Also Read: తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. ఏందీ ‘బాబూ’ ఇదీ?

ఏడాదిన్నర వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ ఐదేళ్లలో కూడా రాయలసీమను కరువు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎంత‌లా అంటే.. కొన్ని ప్రాంతాల్లో నిలువునా ఎదిగిన మామిడి చెట్లు కూడా మాడిపోయాయి! నీటి వ‌న‌రు లేక చీనీ చెట్లు, మామిడి చెట్లు నిలువునా ఎండాయి. వేరుశన‌గ పంట సంగ‌తీ అంతే. కీల‌క‌మైన ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్ నెల‌ల్లో వ‌రుణుడు పూర్తిగా మొహం చాటేసేవాడు. దీంతో ఆ వ‌ర్షాధార పంట ఆకులు ఎండి, చెట్లు నేల‌కు మొహం వాలేసాది. అలాంటి ప‌రిస్థితుల్లో రెయిన్ గ‌న్నులు అంటూ చంద్రబాబు నాయుడు జ‌నాల‌ను వెక్కిరించే వారు. చంద్రబాబు అలా అధికారం నుంచి దిగిపోగానే రాయ‌ల‌సీమ ప్రాంతంపై వ‌రణుడు కరుణ చూపినట్లయింది. గ‌తేడాది జూన్ నుంచి మంచి వ‌ర్షాలే పడ్డాయి. వేరుశ‌న‌గ పంట ద‌క్కింది. భూగ‌ర్భజలాలూ పెరిగాయి. ఇక ఈ ఏడాది అయితే మే నుంచే వ‌రుణుడు తన ప్రతాపం చూపాడు.

అటు కృష్ణా జలాలతో ఈ ఏడాది రాయ‌ల‌సీమ‌కు కరువు తీరింది. అక్కడా ఇక్కడా తేడాలు లేకుండా అన్ని జిల్లాల్లోనూ రికార్డు స్థాయి వానలు పడ్డాయి. అనంత‌పురం, క‌డ‌ప జిల్లాల్లో అయితే గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడలేనంత వర్షాలు పడ్డాయి. ద‌శాబ్దాల కిందట‌ ఎండిపోయిన పెన్నాన‌ది ఇప్పుడు పెన్నేటి పాట పాడుతూ ఉంది. అటు క‌ర్నూలులో కూడా ఈ రెండు జిల్లాలకు మించి వర్షం పడింది. హంద్రీ న‌ది ఉప్పొంగింది.

Also Read: ‘అమరావతి’పై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం

ఈ భారీ వర్షాలతో ఆయా జిల్లాలకు రెండేళ్ల వరకు ఇక ఢోకా లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి నీటి లభ్యతే ఉంటే.. ఇక రాయలసీమ కాస్త రతనాల సీమగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.అటు రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం కూడా పూర్తయితే సీమ‌లో క‌రువ‌నే మాట వినిపించదు.