స్టార్ డైరెక్టర్ లకు ఒకప్పుడు వరుసగా రెండు మూడు ప్లాప్స్ వచ్చినా ఆ డైరెక్టర్ కి ఉన్న స్టార్ డమ్ మాత్రం అలాగే ఉండిపోయేది. కానీ ప్రస్తుతం ప్లాప్ వస్తే స్టార్ డైరెక్టర్ కైనా కొత్త సినిమా రాని పరిస్థితి. ఒక్క సినిమా పోవడంతోనే ప్లాప్ డైరెక్టర్ అనే ముద్ర వేస్తున్నారు. సురేందర్ రెడ్డికి ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోయింది. పాపం ఏకంగా
మెగాస్టార్ తో భారీ సినిమా ‘సైరా’ తీసి మంచి పేరు తెచ్చుకున్నా కూడా.. ఆ సినిమాకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడంతో సురేందర్ రెడ్డి మీద ఆ భారం పడింది. దాంతో ఏ స్టార్ హీరో ఆయనకు పిలిచి అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్నారని, లేదూ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారని ఇటివలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
Also Read: కాజల్ అతడిపై మనసు పారేసుకుందా?
ఓ దశలో అఖిల్ తో ఫైనల్ అయిందని కూడా వినిపించింది. కానీ అంతలో పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజు వదిలిన పోస్టర్ ఆధారంగా సురేందర్ రెడ్డి – పవన్ కలయికలో ఓ సినిమా రాబోతుందని అర్ధం అయింది. అయితే ఈ సినిమా మొదలు అవ్వడానికి మరో రెండేళ్లు సమయం పడుతోంది. కాబట్టి ఈ లోపు సురేందర్ రెడ్డి ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. కాగా తాజాగా తన తరువాత సినిమాని రవితేజ్ తో చేస్తున్నాడని ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత పీవీపీ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు ఈ సినిమా ఫిక్స్ అని సమాచారం.
Also Read: ‘ఆర్జీవీ మిస్సింగ్’.. అనుమానితుడిగా మెగాస్టార్..!
కాగా సురేందర్ రెడ్డి ఇప్పటికే రవితేజ కోసం ఓ స్క్రిప్టు సిద్ధం చేశాడని, ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా ఉండనుందని.. ముఖ్యంగా రవితేజకు సరిపడే స్టోరీతో సురేందర్ రెడ్డి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. మరి సురేందర్ రెడ్డి – రవితేజ కలయిక పై క్లారటీ వచ్చేదాకా సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించిన రూమర్స్ పుంఖానపుంఖాలుగా వస్తూనే ఉంటాయేమో. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాలు తరువాత సురేందర్ రెడ్డి సినిమా మొదలుకానుంది.