https://oktelugu.com/

రాహుల్ హడావుడి.. అంతేనా? కొత్తదేమీ కాదా?

ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ ఘటనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రియాంకగాంధీ నానా హంగామా సృష్టించారు. దళిత యువతిపై హత్యాచారం ఘటనపై రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు ప్రతీఒక్కరు స్పందించాల్సిందే.. ఖండించాల్సిందే. అయితే దేశంలోని అన్నిచోట్ల దళితులపై దాడులు జరుగుతున్న వీరివురి ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనే రాహుల్.. ప్రియాంక హడావుడి చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. Also Read: హత్రాస్ మరువక ముందే తెలంగాణలో మరో దారుణం ఉత్తరప్రదేశ్ త్వరలో ఎన్నికలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 6, 2020 / 12:59 PM IST
    Follow us on


    ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ ఘటనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రియాంకగాంధీ నానా హంగామా సృష్టించారు. దళిత యువతిపై హత్యాచారం ఘటనపై రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు ప్రతీఒక్కరు స్పందించాల్సిందే.. ఖండించాల్సిందే. అయితే దేశంలోని అన్నిచోట్ల దళితులపై దాడులు జరుగుతున్న వీరివురి ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లోనే రాహుల్.. ప్రియాంక హడావుడి చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

    Also Read: హత్రాస్ మరువక ముందే తెలంగాణలో మరో దారుణం

    ఉత్తరప్రదేశ్ త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హథ్రాస్ ఘటనపై పోరాడుతుందనే పలువురు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తుందనే విమర్శలున్నాయి. మహిళలు, దళితులపై దాడులు ప్రతీచోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఏపీలోనూ దళితులపై దాడులు జరిగాయి. శిరో ముండనాలు.. అత్యాచారాలు.. దాడులు సంఘటనలు వెలుగుచూశాయి.

    డాక్టర్ సుధాకర్.. జడ్జి రామకృష్ణలకు ఏపీలో ఏం జరిగిందో అందరికీ తెల్సిందే. విశాఖ, రాజమండ్రిలో దళితులకు శిరోముండనాలు చేయడం సంచలనంగా మారింది. ఇవేమీ రాహుల్ కన్పించకపోవడం శోచనీయంగా మారింది. రాహుల్ సైతం ఉత్తరాది నాయకుల్లానే దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నట్లు కన్పిస్తోంది. ఆయన కేవలం ఢిల్లీ.. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల సమస్యలకే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాహుల్ దేశంలోని మిగతా రాష్ట్రాల్లోని సమస్యలపై ఎందుకు స్పందించడం లేదనే సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

    ప్రస్తుతం బీహార్ ఎన్నికలు.. త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండటంతోనే రాహుల్ మళ్లీ యాక్టివ్ అయ్యారనే టాక్ విన్పిస్తోంది. రాహుల్ కొద్దిరోజులు హడావుడి చేసి మళ్లీ కామ్ అవుతారని సొంత పార్టీ నేతలు చెబుతుండటం గమనార్హం. హథ్రాస్ ఘటనపై రాహుల్ హడావుడితో ఆయన కొంత మైలేజీ వచ్చిన మాట నిజమే. అయినప్పటికీ రాహుల్ ఉత్తరాది నాయకుడిగానే గుర్తింపు పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న దక్షిణాది రాష్ట్రాల్లోని సమస్యలపై రాహుల్ పెద్దగా స్పందించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ రెంటికి చెడ్డ రేవడిలా మారుతోంది.

    Also Read: శూలశోధన: నార్కో ‘‘ట్రిక్స్ ” ఏమిటసలు?

    రాహుల్ ఉత్తరాదితోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో దూకుడు చూపిస్తేనే పార్టీ భవిష్యత్ ఉంటుందని లేకపోతే కాంగ్రెస్ ను కాపాడటం ఎవరీతరం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ ఎన్నికల సమయంలోనే హడావుడి చేయకుండా చిత్తశుద్ధితో అన్నివేళలా ప్రజా సమస్యలపై స్పందిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని లేకుంటే ప్రతిపక్ష హోదా కూడా కనుమరుగు అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాహుల్ ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెడుతారో లేదో వేచిచూడాల్సిందే..!