CM KCR: ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ బీజేపీని తిట్టిపోస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దీంతో బీజేపీపైనే ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. దీనికి ఒకటే ప్రధాన కారణం. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందనే అక్కసుతోనే ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత టీఆర్ఎస్ పాలసీలో మార్పు ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకంటే అన్ని డబ్బులు పోసినా విజయం దక్కకపోవడంతో కేసీఆర్ కు సహజంగానే ఆగ్రహం వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నా ఒక్క బండి సంజయ్ నే లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ రెచ్చిపోవడం చూస్తున్నాం. కానీ ప్రధాని మోడీని తన పదునైన పదజాలంతో ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ వైఖరిలో వచ్చిన మార్పుకు కారణాలేంటని ఆరా తీస్తున్నారు.
Also Read: Kcr And Jagan: జగన్ ను ఇరుకున పెట్టిన కేసీఆర్
మరోవైపు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.ఇదే జరిగితే బీజేపీని ఎదుర్కొనే క్రమంలో కేసీఆర్ ఘాటుగానే స్పందిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో భవిష్యత్ లో ఎదురయ్యే ఇబ్బందులను సైతం పట్టించుకోవడం లేదు.
ఇప్పటికే బీజేపీ నేతలు కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని చెబుతున్న సందర్భంలో కేసీఆర్ లో మరింత ఆగ్రహం పెరిగిపోతోంది. అందుకే బీజేపీపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో తన ప్రభావం చూపాలని చూస్తున్న కేసీఆర్ కు ఇక కష్టాలు తప్పవని హెచ్చరికలు వస్తున్నాయి. అయినా కేసీఆర్ మాత్రం మొండి వైఖరితోనే ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కేసీఆర్ బీజేపీని ఎలా ఎదుర్కొంటారోననే సందేహాలు వస్తున్నాయి.
Also Read: Kcr New Political Party:కేసీఆర్ కొత్త పార్టీపై సర్వేలు..! ప్రజలేమనుకుంటున్నారు..?