Homeజాతీయ వార్తలుAttack on Hindu temple : కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. శ్రీలక్ష్మీ నారాయణ మందిరం...

Attack on Hindu temple : కెనడాలో హిందూ ఆలయంపై దాడి.. శ్రీలక్ష్మీ నారాయణ మందిరం టార్గెట్‌

Attack on Hindu temple : కెనడాలో నాలుగు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో పంజాబాద్‌కు చెందిన యువతి మరణించింది. ఈ ఘటన మర్చిపోక ముందే.. భారతీయ హిందువులు ఆందోళన చెందే వార్త అందింది. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ మందిరాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు టార్గెట్‌ చేశారు. ఏప్రిల్‌ 19, 2025న ఖలిస్థానీ వేర్పాటువాదుల దాడికి గురైంది. ఈ ఘటనలో ఆలయ ప్రవేశ ద్వారాలు, స్తంభాలపై ఖలిస్థానీ అనుకూల గీతలు రాయబడ్డాయి, సీసీటీవీ కెమెరాలు దొంగిలించబడ్డాయి. ఈ విధ్వంసం హిందూ–సిక్కు సమాజాల్లో ఆందోళనను రేకెత్తించింది.

Also Raed : పూరీ జగన్నాథ ఆలయంలో గద్ద అద్భుతం.. జెండాతో ప్రదక్షిణ వీడియో వైరల్‌

గత శనివారం(ఏప్రిల్‌ 19న) తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ మందిరంలోకి చొరబడ్డారు. ఆలయ గోడలు, ప్రవేశ ద్వారాలు, స్తంభాలపై ‘‘ఖలిస్థాన్‌ జిందాబాద్‌’’ వంటి నినాదాలతో గీతలు రాశారు. ఆధారాలు దొరకకుండా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను దొంగిలించారు. ఈ ఘటన మూడవ సారి ఈ ఆలయం ఖలిస్థానీ దాడులకు గురికావడం గమనార్హం. ఆలయ నిర్వాహకులు ఈ చర్యను భక్తుల మనోభావాలను క్షోభపెట్టే ద్వేషపూరిత చర్యగా ఖండించారు.

స్థానిక పోలీసుల దర్యాప్తు
సర్రే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, స్థానిక సమాచారం ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి వెనుక భారత వ్యతిరేక శక్తుల పాత్ర ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఆలయం వద్ద భద్రతా బలగాలను మోహరించారు. అయితే, ఆలయ నిర్వాహకులు, భక్తులు పోలీసులు, రాజకీయ నాయకుల నుంచి తగిన మద్దతు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఖలిస్థాన్‌ ఉద్యమం అంటే ఏమిటి?
ఖలిస్థాన్‌ ఉద్యమం భారతదేశంలోని పంజాబ్‌ ప్రాంతంలో సిక్కుల కోసం స్వతంత్ర రాష్ట్రం స్థాపన లక్ష్యంగా 1970–80లలో ఉద్భవించింది. 1980లలో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారి, భారత ప్రభుత్వం దీనిని అణచివేసింది. అయితే, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సిక్కు డయాస్పోరాలో ఈ ఉద్యమం ఇప్పటికీ కొంత మద్దతు కలిగి ఉంది. కెనడాలో 7.7 లక్షల సిక్కు జనాభా ఉండడం, దేశ జనాభాలో 2.1% ఆక్రమించడం ఈ ఉద్యమానికి బలమైన స్థావరంగా మారింది.

గతంలో ఇలాంటి దాడులు
శ్రీ లక్ష్మీ నారాయణ మందిరంపై గతంలో 2023 ఆగస్టు, 2024 నవంబర్‌లలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. 2023లో ఖలిస్థానీ రిఫరెండం పోస్టర్లను ఆలయ గేట్లపై అతికించారు. 2024లో కాన్సులర్‌ క్యాంప్‌ సందర్భంగా ఖలిస్థానీ మద్దతుదారులు � విధ్వంసానికి గురయ్యాయి, ఇది సమాజంలో భయాందోళనలను రేకెత్తించింది. ఇటీవల, వాంకోవర్‌లోని ఖల్సా దివాన్‌ సొసైటీ గురుద్వారాపై కూడా ఇలాంటి గీతలు రాయబడ్డాయి, దీనిని స్థానిక సిక్కు సమాజం ఖండించింది.

సమాజం నుంచి ఖండన
ఈ ఘటనను హిందూ, సిక్కు సమాజాలు తీవ్రంగా ఖండించాయి. కెనడియన్‌ హిందూ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ దీనిని ‘‘హిందూ ఫోబియా’’గా అభివర్ణించి, కెనడియన్లందరూ ద్వేషానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చింది. ఖల్సా దివాన్‌ సొసైటీ ఈ దాడులను ‘‘కెనడియన్‌ సమాజంలో భయం, విభజన సష్టించే ప్రయత్నం’’గా విమర్శించింది. స్థానిక జర్నలిస్ట్‌ డేనియల్‌ బోర్డ్‌మన్‌ ఆలయ నిర్వాహకులతో మాట్లాడినప్పుడు, వారు పోలీసులు, రాజకీయ నాయకుల నుంచి తగిన స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకుల ప్రతిస్పందన
కెనడియన్‌ ఎంపీ చంద్ర ఆర్య ఈ ఘటనను ‘‘ఖలిస్థానీ తీవ్రవాదం పెరుగుదలకు నిదర్శనం’’గా పేర్కొన్నారు. హిందూ, సిక్కు సమాజాలు ఐక్యంగా ప్రభుత్వం నుంచి తక్షణ చర్యలు డిమాండ్‌ చేయాలని పిలుపునిచ్చారు. భారత హైకమిషన్‌ గతంలో ఇలాంటి దాడులను ‘‘భారత వ్యతిరేక కార్యకలాపాలు’’గా ఖండించింది. అయితే, కొందరు రాజకీయ నాయకులు ఈ ఘటనలపై నిశ్శబ్దం వహిస్తున్నారని, ఖలిస్థానీ మద్దతుదారులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముమ్మరమైన భద్రత
ఈ ఘటన తర్వాత సర్రేలోని ఆలయం వద్ద భద్రతా బలగాలను మోహరించారు. అదనపు సీసీటీవీ కెమెరాలు, రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను పెంచారు. ఇతర హిందూ, సిక్కు మత స్థలాల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలని స్థానిక సమాజం డిమాండ్‌ చేస్తోంది. భారత హైకమిషన్‌ భవిష్యత్తులో కాన్సులర్‌ క్యాంప్‌ల నిర్వహణను స్థానిక భద్రతా ఏర్పాట్లపై ఆధారపడి నిర్ణయిస్తామని పేర్కొంది.

Also Read : దేవాలయాలకు ఎందుకు వెళ్లాలి? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి?

RELATED ARTICLES

Most Popular